News April 7, 2025
గుంటూరు: కుక్కల దాడిలో చిన్నారి మృతి.. ఎమ్మెల్యే దిగ్భ్రాంతి

స్వర్ణభారతీనగర్‌లో కుక్కల దాడిలో చిన్నారి మృతిచెందిన ఘటనపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా కుక్కల సమస్యపై గళమెత్తినా అధికారులు తాత్కాలికంగా చర్యలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి ఐజక్ ఆత్మకు శాంతి చేకూరాలని, అధికారులు ఇప్పటికైనా కుక్కల నియంత్రణ పై దృష్టి సారించాలని అన్నారు.
Similar News
News April 17, 2025
మంగళగిరి: ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలు

AIIMSలో ఇక పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. గుండె జబ్బులకు బైపాస్ సర్జరీలు, ICU విభాగం ప్రారంభమయ్యాయి. ఇటీవల మొదటి సర్జరీ విజయవంతంగా జరిగింది. 46 విభాగాల్లో సేవలందిస్తున్న ఈ ఆసుపత్రిలో రోజూ 3,500మందికి వైద్యం అందిస్తున్నారు. ఇప్పటి వరకు 22లక్షలపైగా రోగులకు సేవలు, 37లక్షల ల్యాబ్ పరీక్షలు నిర్వహించారు. మార్చి చివరి వరకు 4.39లక్షల ఓపీ రోగులు, 42,843 ఇన్‌పేషెంట్లకు సేవలు అందించారు.
News April 17, 2025
అమరావతిలో శాశ్వత సచివాలయానికి టెండర్‌ల విడుదల

అమరావతిని శాశ్వత రాజధానిగా తీర్చిదిద్దే దిశగా సీఎం చంద్రబాబు సర్కార్ కీలక అడుగు వేసింది. నాలుగు సచివాలయ టవర్‌లు, ఒక హెచ్‌వోడీ టవర్ నిర్మాణానికి సంబంధించిన రూ.4,668 కోట్ల విలువైన టెండర్‌లను సీఆర్డీఏ విడుదల చేసింది. మే 1న టెక్నికల్ బిడ్లను పరిశీలించి, తుది కాంట్రాక్టర్‌లను ఎంపిక చేయనున్నారు. మే 2న అమరావతికి ప్రధాని మోదీ రానుండటంతో, నిర్మాణాలపై స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ వేగం కనిపిస్తోంది.
News April 17, 2025
GNT: లీప్ యాప్ ప్రారంభం, పాఠశాల యాప్‌లకు ఒకే చిరునామా

పాఠశాలల యాజమాన్యంలో మార్పుల దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఉన్నత విద్యాశాఖ తీసుకొచ్చిన లీప్ యాప్ బుధవారం నుంచి ఉపాధ్యాయుల వినియోగంలోకి వచ్చింది. హాజరు నమోదు, విద్యార్థుల వివరాలు, పలు సేవలు ఇందులో కేంద్రీకరించారు. ఇప్పటికే ఉపాధ్యాయులు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎలాంటి సమస్యలు లేకుండా వినియోగిస్తున్నారు. స్కూల్ అటెండెన్స్ యాప్‌ను తొలగించి లీప్‌కి మారడంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.