News March 1, 2025

గుంటూరు జిల్లా TODAY TOP NEWS 

image

★ గుంటూరు జిల్లా 143 కోట్ల నిధులు: కేంద్ర మంత్రి పెమ్మసాని★ ఈ రోజు నుంచి కొత్త మోటర్ యాక్ట్ అమలు: ఎస్పీ★ గుంటూరు జిల్లా పెన్షన్ల పంపిణీ★ గుంటూరు: 80 ఏళ్ల వయస్సులో మూడు బంగారు పథకాలు★ గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా మొదటి రోజు ఇంటర్ పరీక్షలు★ మంగళగిరి: వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ దంపతులు★ ఏమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్

Similar News

News March 3, 2025

GNT: అమ్మవారి అనుగ్రహం పేరిట మోసం

image

పూజల పేరిట డబ్బులు వసూలు చేసిన ఘటన GNTలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రాజేశ్వరరావు కాలనీకి చెందిన నాగేశ్వరరావుకు ఇంట్లో అమ్మవారి అనుగ్రహం ఉందని, పూజలు చేస్తే పైసలు వస్తాయని వెంకాయమ్మ అనే మహిళ నమ్మించింది. సిద్ధాంతితో ప్రాణగండం ఉందని చెప్పి భయపెట్టింది. పూజల కోసం విడతల వారీగా రూ. 15 లక్షలు తీసుకుంది. ఫలితం లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

News March 3, 2025

గుంటూరు: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు గుంటూరు మీదుగా చర్లపల్లి(CHZ), కాకినాడ టౌన్(CCT) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఈనెల 7,14, 21, 28న CHZ-CCT(నం.07031), ఈ నెల 2,9,16, 23న CCT- CHZ(నం.07032) రైళ్లు నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలోని గుంటూరుతో పాటు సత్తెనపల్లి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం,రాజమండ్రి, సామర్లకోటలో ఆగుతాయని వారు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. 

News March 3, 2025

తెనాలి: అలర్ట్..ఆ రైళ్ల నంబర్లు మారాయి 

image

తెనాలి, నిడుబ్రోలు మీదుగా ప్రయాణించే 2 రైళ్లకు మార్చి 1 నుంచి నూతన నంబర్లు కేటాయించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు విశాఖపట్నం-కడప మధ్య ప్రయాణించే తిరుమల(డైలీ) ఎక్స్‌ప్రెస్‌లకు పాత నంబర్లు 17487/17488 స్థానంలో 18522/18521 నంబర్లు కేటాయించామన్నారు. ప్రయాణికులు రైలు నంబర్లలో మార్పును గమనించాలని కోరుతూ తాజాగా ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

error: Content is protected !!