News March 27, 2025

గుంటూరు జిల్లా సర్వసభ్య సమావేశం వాయిదా

image

ఈనెల 29వ తేదీన గుంటూరులో జరగనున్న ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా వేసినట్లు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ కత్తెర హెన్రీ క్రిస్టినా బుధవారం తెలిపారు. 2025-26వ సంవత్సర బడ్జెట్‌లో ప్రభుత్వ పథకాలను అదనంగా చేర్చ వలసి ఉన్నందున అదే విధంగా మెజార్టీ సభ్యులు కొంత సమయం కోరిన కారణంగా వాయిదా వేసినట్లు ఛైర్‌పర్సన్ తెలిపారు. 

Similar News

News April 1, 2025

తెనాలి: చిన్నారి మృతి.. హృదయవిదారకం

image

కృష్ణా (D) అవనిగడ్డ(M) పులిగడ్డలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలి వాసులు నలుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. మృతుల్లో 2 నెలల శిశువు కూడా ఉంది. ఆ చిన్నారికి నామకరణం చేసేందుకు మోపిదేవి ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్ని తరలిస్తుండగా కారు వెనుక సీటులో పసికందు పోలీసులకు కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా పాపను బతికించడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

News April 1, 2025

తెనాలి: దైవ దర్శనానికి వెళుతూ అనంత లోకాలకు

image

కృష్ణా జిల్లా పులిగడ్డ వారిధి వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందడంతో తెనాలిలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. చెంచుపేటకు చెందిన రవీంద్ర మోహన బాబు కుటుంబంతో సహా కారులో మోపిదేవి ఆలయానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. 21 రోజుల పసికందుతో సహ రవీంద్ర, అతని భార్య అరుణ, మనుమరాలు(5) ప్రమాదంలో మృతిచెందారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. 

News April 1, 2025

విధుల్లో అలసత్వం వహించరాదు: కలెక్టర్ 

image

గ్రామ సచివాలయ సిబ్బంది విధుల్లో అలసత్వం వహించరాదని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది స్నేహపూరితమైన వాతావరణంలో మెలగాలని అన్నారు. సమయపాలన పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

error: Content is protected !!