News April 9, 2025

గుంటూరు: డెలివరీ బాయ్స్ వివరాలు నమోదు చేయండి

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 18-59 సంవత్సరాల వయస్సు గల డెలివరీ బాయ్స్ సహా అసంఘటిత రంగం కార్మికులు తమ వివరాలు ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సంయుక్త కార్మిక కమిషనర్ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. సోమవారం ప్రారంభమైన ఈ ప్రత్యేక డ్రైవ్‌ ఈనెల 17వ తేదీ వరకు కొనసాగనుందన్నారు. ఈ రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితమని, కార్మికులు తమ ఆధార్, మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలతో నమోదు చేసుకోవాలన్నారు. 

Similar News

News April 19, 2025

GNT: మానవత్వం చాటుకున్న లాలాపేట పోలీసులు

image

గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని లాలాపేట స్టేషన్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో సంగడిగుంటలో ఏఎస్సై నరసింహారావు, కానిస్టేబుల్ నాగరాజు గస్తీ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి వచ్చి తన భార్య కాన్పు నొప్పులతో బాధపడుతుందని, వాహన సదుపాయం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో గస్తీ పోలీసులు గర్భిణిని తమ వాహనంలో జీజీహెచ్ కాన్పుల వార్డుకు తరలించారు.

News April 19, 2025

GNT: ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

image

ప్రధాని నరేంద్ర మోదీ మే 2న తుళ్ళూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ, ఎక్సైజ్ కమిషనర్ నీషాంత్ కుమార్, జేసీ భార్గవ్ తేజ, ఎంటీఎంసీ కమిషనర్ అలీబాషా, ఆర్డీవో కె.శ్రీనివాసరావు ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా హెలీప్యాడ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

News April 18, 2025

గుంటూరు: పెళ్లికి నిరాకరించిన యువకుడిపై కేసు నమోదు

image

గుంటూరులో ఓ యూట్యూబర్ జీవితం ఊహించని మలుపు తిరిగింది. యూట్యూబర్‌గా గుర్తింపు పొందిన యువతికి మార్చి 10న నల్లచెరువు 2వ లైనుకు చెందిన కైలాశ్‌తో నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 18న పెళ్లి జరగాల్సి ఉండగా, వరుడు పెళ్లికి నిరాకరించాడు. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, చేసుకోను అంటూ వెనక్కి తగ్గాడు. మధ్యలో పెద్దలు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో బాధిత యువతి లాలాపేట పీఎస్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

error: Content is protected !!