News June 2, 2024
గుంటూరు: నాగార్జున వర్సిటీకి రెండు రోజులు సెలవులు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి రెండు రోజులు సెలవులు ప్రకటించినట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కరుణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీలో 2024 సార్వత్రిక ఎన్నికల సంబంధించి ఓట్లలెక్కింపు ఉన్న నేపథ్యంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజశేఖర్ ఆదేశాల మేరకు సెలవులు కేటాయించినట్లు పేర్కొన్నారు. వర్సిటీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ నెల 3,4 (సోమ, మంగళవారాలు) తేదీల్లో సెలవులు కేటాయించినట్లు చెప్పారు.
Similar News
News April 24, 2025
ANUలో ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రతిభ

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల 4/4 మొదటి సెమిస్టర్ ఫలితాల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో మొత్తం 638 మంది పరీక్షలు రాయగా 578 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 90.12గా నమోదైంది. రీవాల్యుయేషన్ కోసం మే 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచినట్టు అధికారులు తెలిపారు.
News April 24, 2025
అమరావతిలో తొలి క్వాంటమ్ విలేజ్?

అమరావతిని దేశంలోని మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వెలగపూడిలో జరిగిన సమీక్షలో ఐటీ శాఖ కార్యాచరణను సిద్ధం చేసింది. 50ఎకరాల భూమిపై ఐకానిక్ భవనం నిర్మాణానికి L&T, టెక్నాలజీ మద్దతు కోసం ఐబీఎం ముందుకొచ్చాయి. టీసీఎస్, సీఎంఓ కార్యదర్శి ప్రద్యుమ్న, ఐటీ కార్యదర్శి భాస్కర్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.
News April 24, 2025
ఫిరంగిపురం: టెన్త్ విద్యార్థి ఆత్మహత్య

ఫిరంగిపురం మండల కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురైన పి. వినయ్ కుమార్ అనే విద్యార్థి బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక పాఠశాలలో చదువుతున్న అతను ఫలితాల అనంతరం తాత ఇంటికి వెళ్లి ఉరివేసుకున్నాడు. గమనించిన స్థానికులు అతడిని సమీప ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.