News August 15, 2024
గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో డ్రోన్ కలకలం
గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం డ్రోన్ కలకలం రేపింది. అనుమతి లేకుండా హై సెక్యూరిటీ జోన్లో ఉన్న పోలీస్ పరేడ్ గ్రౌండ్లో డ్రోన్ ఎగరడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మంత్రి నారా లోకేశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డ్రోన్ ఎగరేసిన ఆపరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని డ్రోన్ సీజ్ చేసి విచారణ చేపట్టారు.
Similar News
News November 29, 2024
నేటి నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు
నేటి నుంచి రానున్న 4 రోజుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో భద్రంగా తెలిపారు. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
News November 28, 2024
‘వైసీపీ త్వరలో అంతరించి పోతుంది’
వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. గుంటూరులో గురువారం కనపర్తి మీడియాతో మాట్లాడారు. పుష్ప అంటే మహిళ అని అంబటి భావిస్తున్నారని, రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడానికి అంబటికి 30ఏళ్లు పట్టిందని అన్నారు. అంతరించిన ప్రాంతీయ పార్టీల జాబితాలోకి త్వరలో వైసీపీ చేయబోతుందని జోస్యం చెప్పారు.
News November 28, 2024
వేమూరు: రూ.20 వేల జీతంతో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కార్యాలయం, సీడ్ ఆప్ వారి సంయుక్త ఆధ్వర్యంలో గురువారం వేమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ప్రణయ్ బుధవారం తెలిపారు. మైక్రోసాఫ్ట్ సొల్యూషన్స్, కేఎల్ గ్రూప్, మెడ్ ప్లస్ ఫార్మసీ, ఏయూ బ్యాంక్ కంపెనీలు హాజరవుతాయని వందకు పైగా ఖాళీలు ఉన్నాయన్నారు. వేతనం రూ.10 నుంచి 20వేల వరకు ఉంటుందన్నారు.