News April 13, 2025
గుంటూరు: భక్తిశ్రద్ధలతో చండీహోమం

బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యాన పౌర్ణమి సందర్భంగా శనివారం చండీహోమం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మస్తానయ్య మాట్లాడుతూ.. విశ్వ మానవాళి కోసం శాంతిని కాంక్షిస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో 9 మంది వేద పండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించడం జరిగిందన్నారు.
Similar News
News April 15, 2025
రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు: సుధేష్ణ సేన్

గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ సుధేష్ణ సేన్ గుంటూరు-నంద్యాల సెక్షన్లో స్టేషన్లను మొదటిసారిగా సోమవారం తనిఖీ చేశారు. ప్రత్యేకంగా రైల్వే అధికారులతో సమావేశం నిర్వహించారు. అమృత భారత స్టేషను పనులు ఏ విధంగా జరుగుతున్నాయో పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సాతులూరు, నరసరావుపేట, దొనకొండ మార్కాపురం, నంద్యాల స్టేషన్లను డీఆర్ఎం విస్తృతంగా తనిఖీ చేశారు.
News April 14, 2025
CSK ఓపెనర్‌గా గుంటూరు కుర్రోడు

ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై తరఫున ఈరోజు ఆరంగేట్రం చేసిన గుంటూరు కుర్రోడు షేక్ రషీద్ బ్యాటింగ్‌తో అదరగొట్టారు. LSGతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్‌గా వచ్చి 19 బంతుల్లో 27(6 ఫోర్లు) పరుగులు చేశారు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో పూరన్ చేతికి చిక్కి అవుటయ్యారు. రూ.30లక్షలకు రషీద్‌ను చెన్నై సొంతంగా చేసుకోగా.. ఈ సీజన్లో అతనికిదే మొదటి మ్యాచ్.
News April 14, 2025
ఏప్రిల్ 16న గుంటూరులో మిర్చి రైతుల నిరసన

పేరేచర్లలో మిర్చి సాగు చేసిన కౌలు రైతులు దిగుబడి తక్కువగా రావడంతో అధిక నష్టాలు భరిస్తున్నారు. మార్కెట్లో ధరలు పడిపోవడంతో రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. మద్దతు ధర ప్రకటించినా, కొనుగోలు ప్రక్రియ లేదు. రైతులు బోనస్ ఇవ్వాలని, రూ.15,000కి క్వింటాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ 16న గుంటూరులో నిరసన నిర్వహించనున్నారు.