News September 19, 2024
గుంటూరు: మాది మంచి ప్రభుత్వం: సీఎం
ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం అంకిత భావంతో నిర్ణయాలు తీసుకుంటున్న తమ ప్రభుత్వం మంచి ప్రభుత్వమని గురువారం సీఎం చంద్రబాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడమే కాకుండా అభివృద్ధికి సంబంధించి రాష్ట్రంలోని ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తున్నదన్నారు. 100 రోజుల్లో 100కు పైగా సంక్షేమ పథకాలు అమలు చేసిన మంచి ప్రభుత్వం అన్నారు.
Similar News
News November 10, 2024
నేడు గుంటూరుకి రానున్న డిప్యూటీ సీఎం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం గుంటూరుకు రానున్నారు. నగరంలోని అరణ్య భవన్లో ఉదయం 11 గంటలకు అటవీ అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొని అటవీ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్నారు. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు డిప్యూటీ సీఎం రాక కోసం ఏర్పాట్లు చేపట్టారు. తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ గుంటూరు నగరానికి రానున్నారు.
News November 10, 2024
GNT: బోరుగడ్డ అనిల్ వివాదం.. సీఐపై వేటు
బోరుగడ్డ అనిల్‌కి అరండల్‌పేట స్టేషన్‌లో రాచమర్యాదలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఐ కె.శ్రీనివాసరావును వీఆర్‌కు పంపుతూ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖ సిబ్బంది నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో క్రమ శిక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని త్రిపాఠి హెచ్చరించారు.
News November 10, 2024
గుంటూరు: ఐదవ సారి రక్తదానం చేసిన శ్రీనివాస్
విజయవాడలోని ఓ హాస్పిటల్లో ఆపరేషన్ సమయంలో ఓ పేషెంట్‌కు రక్తం తక్కువగా ఉండటంతో 0+ బ్లడ్ కావాలని డాక్టర్ సూచించారు. కుటుంబసభ్యులు వెంటనే పొన్నూరుకు చెందిన ‘పొన్నూరు బ్లడ్వెల్ఫేర్ అసోసియేషన్’ సంస్థను సంప్రదించారు. దీంతో సంస్థ సభ్యుడు శ్రీనివాస్ స్పందించి 5వ సారి రక్తదానం చేశారు. అత్యవసర సమయంలో ఆదుకున్న శ్రీనివాసుకు పేషంట్ బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.