News April 16, 2024

గుంటూరు మీదుగా సికింద్రాబాద్-సంత్రాగచి ప్రత్యేక రైలు.

image

వేసవికాలం ప్రయాణికుల రద్దీ కారణంగా గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 20 నుంచి జూన్ 29వ తేదీ వరకు ప్రతి మంగళ, శనివారాల్లో సికింద్రాబాద్లో బయలుదేరి సంత్రాగచి బుధ, శనివారాల్లో చేరుతుందన్నారు. తిరిగి ఈనెల 21 నుంచి జూన్ 30వ తేదీ వరకు సత్రాగచిలో ప్రతి బుధ, ఆదివారాల్లో బయలుదేరి సికింద్రాబాద్ గురు, సోమవారాల్లో చేరుతుందన్నారు. 

Similar News

News December 31, 2025

గుంటూరులో పడిపోయిన గాలి నాణ్యత

image

గుంటూరులో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. మంగళవారం AQI.in నివేదిక ప్రకారం, నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 229గా నమోదైంది. ఇది ‘సివియర్’ కేటగిరీ కిందకు వస్తుంది. గుంటూరుతో పాటు పరిసర ప్రాంతాలైన తెనాలి, బాపట్ల వైపు కూడా కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉంది. నగరంలోని పలు ప్రాంతాల్లో AQI 212 నుంచి 243 మధ్య నమోదైంది. చలి తీవ్రత పెరగడం, వాహనాల కాలుష్యం కారణంగా గాలి నాణ్యత దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

News December 31, 2025

అయోధ్యలో చంద్రబాబుకు ‘జాతీయ’ నీరాజనం

image

అయోధ్య రామమందిర రెండో వార్షికోత్సవం వేళ సీఎం చంద్రబాబు పర్యటన జాతీయ స్థాయిలో ఆసక్తి రేపింది. ఉత్తరాది భక్తులు ఆయనను ‘హైటెక్ సిటీ సీఎం’గా, మోదీ మిత్రుడిగా గుర్తించి బ్రహ్మరథం పట్టారు. అభివృద్ధి, ధర్మం అనే రెండు చక్రాలపై ఆయన రాజకీయం సాగుతోందని జాతీయ మీడియా విశ్లేషించింది. ‘రామరాజ్యమే పాలనకు ప్రామాణికం’ అని బాబు వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.

News December 31, 2025

GNT: Bro.. ఈరోజు సాయంత్రం ప్లాన్ ఏంటి.?

image

నేటితో 2025 ముగిసి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాం. ఇవాళ DEC 31st కావడంతో ఇప్పటికే చాలా మంది పార్టీ మూడ్‌లోకి వెళ్లిపోయారు. రాత్రి ఫ్రెండ్స్, ఫ్యామిలీతో పార్టీలకు ముందస్తు ప్లాన్స్ చేసుకున్నారు. కొందరు బార్లు, ఇంకొందరు ఇంట్లో, బయట వెకేషన్లలో.. లొకేషన్ ఏదైనా ప్రిపరేషన్ మాత్రం వేడుకలే. పార్టీలో ముక్కా, చుక్కా తప్పనిసరిగా ఉండాల్సిందే అంటున్నారు. మీ సాయంకాలం ప్లాన్స్ ఏంటో కామెంట్ చేయండి.