News February 28, 2025
గుంటూరు: సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రద్దు

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న కారణంగా విజయవాడ మీదుగా గుంటూరు- విశాఖపట్నం మధ్య ప్రయాణించే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లను దక్షిణ మధ్య రైల్వే 2 రోజుల పాటు రద్దు చేసింది. ఈ మేరకు మార్చి 1,2 తేదీలలో గుంటూరు-విశాఖపట్నం(నం.17239), విశాఖపట్నం-గుంటూరు(నం.17240) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను మార్చి 2,3 తేదీలలో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News December 18, 2025
రైతుల ఖాతాల్లోకి రూ.53 కోట్లు: సివిల్ సప్లైస్ మేనేజర్

ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు జిల్లాలో 3,520 మంది రైతుల వద్ద నుంచి 26,500 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని సివిల్ సప్లై జిల్లా మేనేజర్ తులసి తెలిపారు. తెనాలిలో వ్యాగన్ల ద్వారా జరుగుతున్న ధాన్యం ఎగుమతులను బుధవారం సాయంత్రం పరిశీలించారు. రూ.53 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. నేడు, రేపు 2,700 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వ్యాగన్లలో కాకినాడ జిల్లా పెద్దాపురం మిల్లుకు తరలిస్తున్నట్టు తెలిపారు.
News December 17, 2025
గుంటూరు జిల్లాలో పోలీసుల స్పెషల్ డ్రైవ్

ఈవ్ టీజింగ్, బైక్ రేసింగ్ అరికట్టేందుకు పోలీస్ శాఖ బుధవారం గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. పలు స్టేషన్ల పరిధిలో ఈవ్ టీజింగ్ కి పాల్పడుతున్న 260 మంది, బైక్ రేసింగ్, ర్యాష్ డ్రైవింగ్‌కి పాల్పడుతున్న 214 మందిని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వారందరికీ కౌన్సిలింగ్ నిర్వహించి భవిష్యత్తులో ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
News December 17, 2025
అమరావతి: AGICL ఎండీగా SVR శ్రీనివాస్ బాధ్యతలు

అమరావతి గ్రోత్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(AGICL) MDగా రిటైర్డ్ IAS అధికారి SVR శ్రీనివాస్ బుధవారం రాయపూడిలోని CRDA కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. AGICL ఎండీగా నియమితులైన SVR శ్రీనివాస్‌కు పలువురు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. 1989 IAS బ్యాచ్‌కు చెందిన SVR శ్రీనివాస్ మహారాష్ట్ర క్యాడర్‌కు చెందినవారు కాగా..పాలనా సంస్కరణలు, పట్టణాభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు.


