News April 12, 2025

గుంటూరు: హత్య కేసులో నిందితుల అరెస్ట్

image

పాత గుంటూరులో ఏప్రిల్ 1న జరిగిన హత్య కేసులో పరారీలో ఉన్న ఫైరోజ్, ఫయాజ్‌‌లు అరెస్టైయ్యారు. షేక్ అర్షద్ బాలికను వేధిస్తున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక సోదరులు ఫైరోజH, ఫయాజ్‌లు స్నేహితులతో కలిసి అర్షద్‌ను తీవ్రంగా కొట్టారు. దీంతో అర్షద్ కుటుంబ సభ్యులు బాలిక కుటుంబంపై దాడి చేశారు. ప్రతిగా ఫైరోజ్, ఫయాజ్‌లు అర్షద్ కుటుంబంపై దాడి చేయడంతో అర్షద్ అమ్మమ్మ చనిపోయింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News April 13, 2025

గుంటూరులో గ్రీవెన్స్ డే రద్దు

image

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్క‌ర్ జయంతిని పురస్కరించుకొని గుంటూరు కలెక్టరేట్లో రేపు(సోమవారం) జరిగే గ్రీవెన్స్ డేని రద్దు చేశారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి ప్రకటన విడుదల చేశారు. అంబేడ్క‌ర్ జయంతి సందర్భంగా పబ్లిక్ హాలిడే ఉన్నందున గ్రీవెన్స్‌ను డే రద్దు చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి అధికార యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

News April 13, 2025

రూ.300 కోట్లతో రిటైనింగ్ వాల్: మంత్రి లోకేశ్

image

మహానాడు ప్రాంతంలో వరద ముంపు నివారణకు రూ.300 కోట్లతో రిటైనింగ్ వాల్ మంజూరైందని, పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మంగళగిరి రూరల్ యర్రబాలెంలోని మన ఇల్లు-మన లోకేశ్ కార్యక్రమంలో భాగంగా 5వరోజు మహానాడు కాలనీవాసులకు పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రిటైనింగ్ వాల్ నిర్మాణంపై ఆయన మాట్లాడారు. మంగళగిరిని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామన్నారు.

News April 13, 2025

ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ అద్భుత విజయం

image

ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అద్భుత విజయం సాధించారని అడ్మిన్ అడ్వైజర్ సీఏ మట్టుపల్లి మోహన్ తెలిపారు. MECలో లిఖిత, గీతిక, హరిణి 494/500 మార్కులు సాధించారు. 490కి పైగా 88 మంది, 480 ఆపైన 498 మంది, 649 మందికి 475 ఆపైన మార్కులు వచ్చాయి. సీనియర్ ఇంటర్లో సాత్విక 982 మార్కులు, 970 ఆపైన 71 మంది, 141 మంది 960 ఆపైగా మార్కులు సాధించారని పేర్కొన్నారు. విద్యార్థులను యాజమాన్యం అభినందించింది.

error: Content is protected !!