News February 12, 2025
గుంటూరులో నేటి చికెన్ ధరలు ఇవే!
గుంటూరు జిల్లాలో పొరుగు జిల్లాలతో పోల్చుకుంటే చికెన్ కి డిమాండ్ ఎక్కువగానే ఉంది. జిల్లాలో నేడు స్కిన్ లెస్ రూ.246, స్కిన్ రూ.236గా ఉంది. సాధారణ రోజుల్లో గుంటూరుకి ఇతర జిల్లాలకు 5, 10 రూపాయలు తేడా ఉండేది. కానీ ఇప్పుడు ఇతర జిల్లాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒకేసారి గుంటూరుకి ఇతర జిల్లాలకు రూ.20 నుంచి రూ.25 వ్యత్యాసం కనిపిస్తోంది.
Similar News
News February 12, 2025
కొల్లిపరలో భారీ కొండ చిలువ
కొల్లిపర మండలం పిడపర్తిపాలెంలో బుధవారం భారీ కొండచిలువ కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు ఆదాము ఉదయం పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. ఈ సమయంలో నిమ్మతోటలో భారీ కొండ చిలువ కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. ఊర్లోకి వెళ్లి గ్రామస్థులను తీసుకువచ్చి కొండ చిలువను పట్టుకొని కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వదిలారు. తరచూ గ్రామంలో, పొలాల్లో కొండ చిలువలు కనిపిస్తుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
News February 12, 2025
JEEలో సత్తాచాటిన గుంటూరు అమ్మాయి
JEE మెయిన్స్ ఫలితాల్లో గుంటూరుకు చెందిన గుత్తికొండ సాయిమనోజ్ఞ సత్తా చాటింది. తొలి విడత పేపర్-1 ఫలితాల్లో 100% మార్కులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాలికల విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. నగరానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ కిషోర్ చౌదరి, ప్రైవేట్ ఆసుపత్రిలో HODగా పనిచేస్తున్న పద్మజ దంపతుల కుమార్తెనే సాయిమనోజ్ఞ. ఇష్టపడి విద్యను అభ్యసించడం కారణంగా 100% మార్కులు సాధించానని హర్షం వ్యక్తం చేస్తుంది.
News February 12, 2025
టెన్త్ అర్హతతో 55 ఉద్యోగాలు
10th అర్హతతో గుంటూరు జిల్లా(డివిజన్లో) 55GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైకిల్ లేదా బైక్ నడిపే సామర్థ్యం, వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. టెన్త్లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3 వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.