News March 13, 2025
గుంటూరులో ఫైనాన్స్ కంపెనీ భారీ మోసం

ఐదున్నర కిలోల బంగారం తాకట్టు పెడితే కేవలం వెయ్యి గ్రాములే అని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులు పత్రాలు సృష్టించి ఓ వైద్యురాలిని మోసం చేశారు. పోలీసుల కథనం మేరకు.. ముత్యాలరెడ్డి నగర్‌కి చెందిన ఓ వైద్యురాలు అరండల్‌పేటలోని ఓ ప్రయివేట్ ఫైనాన్స్ కంపెనీలో ఐదున్నర కిలోల బంగారాన్ని తాకట్టు పెట్టారు. సంస్థలో పనిచేసే ఐదుగురు సిండికేట్‌గా ఏర్పడి నాలుగున్నర కేజీల బంగారాన్ని తప్పుడు పత్రాలతో కాజేశారు.
Similar News
News March 14, 2025
రేపటి నుంచి ఒంటిపూట బడులు: DEO

ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు పాఠశాలలకు ఒంటి పూట బడులు నిర్వహించాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక ఆదేశించారు. ఉదయం 7.45 ని.ల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు స్కూల్స్ నిర్వహించాలన్నారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలున్న పాఠశాలలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల తరగతులు పెట్టాలని చెప్పారు. ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకొని పాఠశాలల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచాలన్నారు.
News March 14, 2025
గుంటూరు: 10th విద్యార్థులకు గుడ్ న్యూస్

ఈనెల 17 నుంచి 31వరకు పదో తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని గుంటూరు జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారి రవికాంత్ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్‌ని కండక్టర్‌కి చూపించి తమ గ్రామాల నుంచి పరీక్షా కేంద్రాలకు వెళ్లొచ్చని చెప్పారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఈ అవకాశం కల్పించామన్నారు. దీనిపై మీ కామెంట్.
News March 14, 2025
మద్దతు ధరలకు రబీ పంటల కొనుగోలు: జేసీ

గుంటూరు జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్‌లో పండించిన మినుములు, శనగలు, పెసలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయనున్నట్లు జేసీ భార్గవ్ తేజ గురువారం తెలిపారు. మినుములకు క్వింటాలుకు రూ.7,400లు, శనగలు రూ.5,650లు, పెసలు రూ.8,682లు కనీస మద్దతు ధర నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ-క్రాప్లో నమోదు చేసుకున్న రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయించదలుచుకుంటే ఈనెల 15వ తేదీ నుంచి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.