News December 28, 2024
గుండెపోటుతో MLC రామచంద్రయ్య కుమారుడి మృతి
కడప జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య కుమారుడు విష్ణు స్వరూప్ గుండెపోటుతో మృతి చెందారు. మధ్యాహ్నం గుండె పోటుకు గురికాగా హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనతో రామచంద్రయ్య ఇంట్లో విషాదం నెలకొంది.
Similar News
News December 31, 2024
న్యూయర్ వేళ.. కడప ఎస్పీ హెచ్చరికలు
నూతన సంవత్సర వేడుకలలో యువకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే తాటతీస్తామని జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువత సామరస్యంగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. బైకులకు సైలెన్సర్ తీసి పెద్దగా శబ్దం చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే బైక్ సిస్టంతో పాటు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలీసులకు దయచేసి సహకరించాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.
News December 30, 2024
కమలాపురంలో రైలు కిందపడి మహిళ మృతి
కమలాపురంలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. గుర్తుతెలియని ఓ మహిళ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ కమలాపురం రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళుతుంది. ఈ క్రమంలో రైలు వచ్చి ఢీకొట్టడంతో కిందపడింది. స్థానికులు అక్కడికి చేరుకొని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 30, 2024
‘పెండింగ్ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలి’
కడప జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల నిర్మాణ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ డా. శ్రీధర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి నిర్మాణ పనుల పురోగతిపై ఆయా శాఖల ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా మినరల్ ఫండ్ ద్వారా నిర్మిస్తున్న వివిధ రకాల పెండింగ్ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలన్నారు.