News March 17, 2025
గుండెపోటుతో ఆదివాసీ నాయకుడు మృతి

ఆళ్లపల్లి మండలం, మర్కోడు పంచాయితీ జిన్నెలగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ నాయకుడు కొమరం నరసింహారావు సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. నరసింహారావు వ్యవసాయం చేస్తూ, ఆదివాసీల అభివృద్ధి కోసం క్రియాశీలపాత్ర పోషించాడు. ఆయన మృతి విషయం తెలుసుకున్న పలువురు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
Similar News
News March 17, 2025
రూ. లక్ష జీతంతో SBIలో ఉద్యోగాలు

రిటైల్ ప్రొడక్ట్స్ విభాగంలో 273 పోస్టుల భర్తీకి SBI దరఖాస్తులు కోరుతోంది. మేనేజర్ పోస్టులకు ఈ నెల 21, FLC కౌన్సెలర్/డైరెక్టర్ పోస్టులకు 26లోగా దరఖాస్తులు చేసుకోవచ్చు. వయసు 28 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. MBA, PGDM, PGPM, MMS పాసై అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. sbi.co.inలో అప్లై చేయాలి. మేనేజర్‌కు రూ.85,920- రూ.1,05,280, FLC కౌన్సెలర్/డైరెక్టర్లకు రూ.50,000 ఇస్తారు.
News March 17, 2025
రేపు యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ

ఈనెల 18న యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. యాదగిరిగుట్ట క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నారు. ఈ నెల 18న గిరి ప్రదిక్షణకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. కాగా ఈ నెల 14 వరకు ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాటు చేశామని ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు.
News March 17, 2025
మెదక్: లక్ష్యాలు పూర్తి చేయడంలో వేగం పెంచాలి: అదనపు కలెక్టర్

బ్యాంక్ గ్యారంటీలు, సీఎంఆర్ లక్ష్యాలు పూర్తి చేయడంలో రైస్ మిల్లర్స్, బ్యాంకర్స్ వేగం పెంచాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. సోమవారం ఖరీఫ్ 24 -25 సంబంధించి బ్యాంక్ గ్యారంటీలు అందజేయడం, సీఎంఆర్ లక్ష్యాలపై బ్యాంకర్లు, రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాల మేరకు లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.