News February 4, 2025
గుండెపోటుతో జన్నారం అదనపు ఎస్సై మృతి
మంచిర్యాల జిల్లా జన్నారం మండల అదనపు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ నాయక్ (60) గుండెపోటుతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. తానాజీ నాయక్ సొంత గ్రామం ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలం ఏంద గ్రామం. ప్రస్తుతం జన్నారం మండలం ఇంధన్ పల్లిలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. తానాజీ మృతి పట్ల లక్షెట్టిపేట సీఐ నరేందర్, జన్నారం ఎస్ఐ రాజవర్ధన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
Similar News
News February 4, 2025
ఆర్మీ చీఫ్ మాటల్ని RG వక్రీకరించారు: రాజ్‌నాథ్
దేశ భద్రతపై రాహుల్‌గాంధీవి బాధ్యతా రాహిత్య రాజకీయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మండిపడ్డారు. భారత్-చైనా సరిహద్దు పరిస్థితులపై ఆర్మీ చీఫ్ చెప్పని మాటలను చెప్పినట్టుగా ఆయన వక్రీకరించారని విమర్శించారు. గస్తీ అంశంలో వివాదం తలెత్తినట్టు మాత్రమే చెప్పారన్నారు. 1962లో చైనా 38k sqkm ఆక్రమించిందని, 1963లో 5k sqkmను పాక్ ఆక్రమించి చైనాకు ఇచ్చిందన్నారు. రాహుల్ చరిత్ర తెలుసుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
News February 4, 2025
అందోల్: క్యాన్సర్ నియంత్రణపై దృష్టి: మంత్రి
క్యాన్సర్ వ్యాధి నియంత్రణపై పూర్తిస్థాయి దృష్టి సారించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ పై అవగాహన పెంపొందించడానికి, నివారణ, గుర్తింపును ప్రారంభదశలో చికిత్సను ప్రోత్సహించేందుకు ప్రతియేటా ఫిబ్రవరి 4వ తేదీని పురస్కరించకుని ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
News February 4, 2025
పోలీసు కుటుంబాలకు అండగా ఉంటా: కడప ఎస్పీ
జిల్లాలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది, వారి కుటుంబాలకు ఎటువంటి ఆపద కలిగినా తాను అండగా ఉండి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ భరోసా ఇచ్చారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏపీ పోలీస్ అధికారుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో పోలీస్ డైరీ -2025ను ఎస్పీ ఆవిష్కరించారు. ఏఎస్పీ ప్రకాశ్ బాబు, పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.