News February 4, 2025
గుండెపోటుతో జన్నారం అదనపు ఎస్సై మృతి
జన్నారం మండల అదనపు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ నాయక్ (60) గుండెపోటుతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. తానాజీ నాయక్ సొంత గ్రామం ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలం ఏంద గ్రామం. ప్రస్తుతం జన్నారం మండలం ఇంధన్ పల్లిలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. తానాజీ మృతి పట్ల లక్షెట్టిపేట సీఐ నరేందర్, జన్నారం ఎస్ఐ రాజవర్ధన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
Similar News
News February 4, 2025
విషాదం.. విదేశంలో ఆదిలాబాద్ వాసి మృతి
నైజీరియా దేశంలో ఆదిలాబాద్ జిల్లా వాసి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన గోనెల మహేందర్ నైజీరియాలోని సిమెంట్ పరిశ్రమలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య సునీత, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత మంగళవారం మహేందర్ గుండెపోటుతో మృతి చెందాడు. నియమ నిబంధనలు పూర్తి చేయడంలో జాప్యం చేసుకోవడంతో మృతదేహం ఇక్కడికి ఇంకా చేరుకోలేదు.
News February 4, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి షాక్.. బరిలో మరో అభ్యర్థి
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా నుంచి తొలి నామినేషన్ దాఖలైంది. కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ సోమవారం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని ప్రకటించక కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది.
News February 4, 2025
ఆదిలాబాద్: MALE నిరుద్యోగులకు GOOD NEWS
ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈనెల 5న TSKC ఆధ్వర్యంలో TASK సౌజన్యంతో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సంగీత, TSKC కోఆర్డినేటర్ శ్రావణి పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో HETERO లాబొరేటరీస్‌లో ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్ లో పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఐటిఐ, మెకానికల్ డిప్లమా పాసైన యువకులు మాత్రమే అర్హులన్నారు. SHARE IT.