News February 18, 2025
గుడివాడ: కొడాలి నాని ఆసక్తికర్ వ్యాఖ్యలు

రెడ్ బుక్ గురించి తనకు తెలియదని, దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉండటం లేదన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘అధికారంలో ఉన్నప్పుడు యాక్టివ్‌గా ఉన్నాం. మా ఉద్యోగం పీకేశారు. ఇప్పుడు యాక్టివ్‌గా ఉండి ఏం చేయాలి’ అంటూ సెటైరికల్ ఆన్సర్ ఇచ్చారు. వంశీ అరెస్ట్ లాంటివి చిన్న చిన్న విషయాలని అన్నారు.
Similar News
News February 21, 2025
కృష్ణాజిల్లా నేటి ముఖ్యాంశాలు

*కృష్ణా: డీజీపీకి లేఖ రాసిన పేర్ని నాని. *కృష్ణాజిల్లా పోలీసులను అభినందించిన హోంమంత్రి. *కృష్ణా జిల్లాలో మొదటి జీబీఎస్ కేసు. *అమలాపురం లాడ్జిలో పోరంకి డాక్టర్ మృతి. * ఉయ్యూరులో మద్యం మత్తులో వీరంగం. *కృష్ణా: APK ఫైల్ క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతా ఖాళి. *గన్నవరం: వంశీ కేసులో పిటిషన్ వాయిదా.
News February 21, 2025
డీజీపీకి లేఖ రాసిన పేర్ని నాని

డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు మాజీ మంత్రి పేర్నినాని లేఖ రాశారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అక్రమ కేసుల వెనుక ఉన్న కోణాన్ని తెలుసుకోవాలని, బాధ్యతారహితంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని లేఖలో డీజీపీని కోరారు.
News February 21, 2025
కృష్ణాజిల్లా పోలీసులకు హోం మంత్రి అభినందనలు

కృష్ణాజిల్లా పోలీసులను హోం మంత్రి అనిత అభినందించారు. ఈ సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా ప్రశంసించారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం ముస్తాబాద్ బాలికలు అదృశ్యమైన ఘటనలో పోలీసుల స్పందించిన తీరును ఆమె మెచ్చుకున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ రావు, సత్తెనపల్లి DSP, సీఐలకు ఫోన్ చేసి అభినందించినట్లు ఆమె Xలో పోస్ట్ చేశారు.