News January 31, 2025
గుడివాడ: ఫైనాన్స్ వేధింపులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య

ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తట్టుకోలేక గుడివాడ రూరల్ మండలం మోటూరు గ్రామానికి చెందిన రావి సత్తిబాబు (35) అనే ఆటో డ్రైవర్ ఉరి వేసుకొని చనిపోయాడు. గుడివాడలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ వద్ద రూ.7.80 లక్షల రుణం తీసుకున్నాడు. ప్రతినెల 5వ తేదీ వాయిదా చెల్లించవలసి ఉండగా ఈ నెల 25న ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది ఒత్తిడి చేశారని, ఇంటికి వచ్చి అల్లరి చేశారని సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Similar News
News April 23, 2025
కృష్ణా: ధరిత్రిని కాపాడుకుందాం- కలెక్టర్

జిల్లా ప్రజలు ధరిత్రిని కాలుష్యం నుంచి కాపాడడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. మంగళవారం ధరిత్రి దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లోని తన చాంబర్లో కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన గోడ పత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ధరిత్రి దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఒక పర్యావరణ అవగాహన కార్యక్రమం అని పేర్కొన్నారు.
News April 22, 2025
కృష్ణాజిల్లాలో ఉత్కంఠత

పదవ తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో మొత్తం 25,259మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. రెగ్యులర్ విద్యార్థులు 21,009, ప్రైవేట్, ఒకేషనల్ విద్యార్థులు 4,250 మంది ఉన్నారు. రేపు విడుదలయ్యే పరీక్షా ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
News April 22, 2025
కృష్ణా: ‘ఈ- కేవైసీ చేయకపోతే రేషన్ అందదు’

రేషన్ కార్డు లబ్ధిదారులు ఏప్రిల్ 30లోపు కేవైసీ పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సూచించారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటనను విడుదల చేశారు. జిల్లాలో 71,110 మంది ఇంకా చేయాల్సి ఉందని చెప్పారు. 5 ఏళ్లు లోపు, 80 ఏళ్లు పైబడినవారికి మినహాయింపు ఉందన్నారు. సంబంధిత వివరాలు డీలర్లు, తహసీల్దార్ల వద్ద ఉన్నాయని, గడువు మించినవారికి పథకాల లబ్ధి ఉండదని హెచ్చరించారు.