News April 24, 2025

గుడివాడ: వైసీపీకి హనుమంతరావు రాజీనామా..?

image

వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు రాజీనామా చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి కీలక నేతగా ఉన్న ఆయన, కూటమి అక్రమాలపై కలెక్టర్‌కు వినతి కార్యక్రమంలో పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. ఆయన బాటలోనే మరికొందరు నేతలు రాజీనామాకు సిద్ధమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మండలి హనుమంతరావు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

Similar News

News April 24, 2025

భట్టిప్రోలులో రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

image

బాపట్ల జిల్లా భట్టిప్రోలులో బుధవారం రాత్రి రేపల్లె డెల్టా రైలు కింద పడి యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. సదరు వ్యక్తి ఛాతి నొప్పితో బాధపడుతున్నాడు. మనస్తాపానికి గురై అతను ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతుడు కనపర్తి సందీప్(17)ను అద్దేపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని భట్టిప్రోలు పోలీసులు తెలిపారు.

News April 24, 2025

MBNR: ఇంటర్ పాస్ అయిన వారికి గుడ్ న్యూస్ !

image

2025-26 విద్యాసంవత్సరానికి గాను ఆంగ్ల మాధ్యమంలో ఉమ్మడి పాలమూరు పరిధిలోని దేవరకద్ర, నాగర్ కర్నూల్, నారాయణపేట మహాత్మా ఫూలే బీసీ గురుకుల(పురుషులు) డిగ్రీ కళాశాలలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ జె.సత్యనారాయణరెడ్డి తెలిపారు. B.Sc, B.Com, B.A కోర్సుల్లో ఆసక్తిగల విద్యార్థులు అడ్మిషన్ కోసం నేరుగా కళాశాలలో సంప్రదించాలని/ సంబంధిత వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.

News April 24, 2025

అమీన్పూర్: తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు: డీఈవో

image

సంగారెడ్డి జిల్లాలో నేటి నుంచి జూన్ 11 వరకు అన్ని రకాల పాఠశాలలకు వేసవి సెలవులు పాఠశాల విద్యాశాఖ ప్రకటించిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. సెలవులలో ఎవరైనా పాఠశాలలో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయాన్ని అన్ని రకాల యజమాన్యాల ప్రధానోపాధ్యాయులు గమనించాలని పేర్కొన్నారు.

error: Content is protected !!