News January 29, 2025

గుడిహత్నూర్: రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

image

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మన్నూర్ గ్రామం వద్ద మంగళవారం రాత్రి జాతీయ రహదారి దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా మృతులు ఎవరు అన్నది ఇంకా గుర్తు తెలియరాలేదు.

Similar News

News February 3, 2025

ఆదిలాబాద్: దివ్యాంగుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

వికలాంగుల ఉపాధి, పునరావాస పథకం కింద దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించటానికి అర్హులైన దివ్యాంగులు దరఖాస్తులు చేసుకోవాలని ఆదిలాబాద్ DWO సబిత తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈనెల 12 తేదీ లోపు https://tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ పథకం క్రింద బ్యాంకు లింకేజ్ లేకుండా నేరుగా రూ.50 వేలు సబ్సిడీ వర్తిస్తుందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 21 యూనిట్లు జిల్లాకు కేటాయించడం జరిగిందన్నారు.

News February 2, 2025

ADB రిమ్స్ ఆసుపత్రిలో NCD క్లినిక్‌ను ప్రారంభించిన కలెక్టర్

image

అసాంక్రమిక వ్యాధులచే బాధపడుతున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించుటకు ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో NCD క్లినిక్ ను కలెక్టర్ రాజర్షిషా ప్రారంభించారు. అనంతరం రోగులను పరీక్షించే గది, వ్యాధిగ్రస్తులకు సేవలు అందించే గదులను ఆయన సందర్శించారు. NCD క్లినిక్‌లో అసాంక్రమిక వ్యాధులతో (రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ మొదలైనవి) వాటితో బాధపడుతున్న వ్యాధిగ్రస్థులకు అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

News February 2, 2025

ఇచ్చోడలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

మామడ (M) పులిమడుగుకు చెందిన తులసిరాం, రాజు శనివారం బైక్‌పై ఇంద్రవెల్లి (M) కేస్లాపూర్ నాగోబా జాతరకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అధికవేగంతో ప్రయాణిస్తున్న వారి బైకు ఇచ్చోడ (M) దుబార్ పేట్ వద్ద లారీని తప్పించబోయి కిందపడింది. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని అంబులెన్స్‌లో రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాజు మృతి చెందాడని ఎస్సై తిరుపతి తెలిపారు.