News April 18, 2025

గుణదలలో షూటింగ్ బాల్ జిల్లా జట్ల ఎంపికలు

image

కృష్ణాజిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాల బాలికల షూటింగ్ బాల్ జిల్లా జట్ల ఎంపికలు ఏప్రిల్ 21న గుణదలలో నిర్వహిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి గోగులమూడి విజయ్ కుమార్ తెలిపారు. ఈ పోటీలకు ఆసక్తి గల క్రీడాకారులు ఆధార్ జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని కోరారు. ఇక్కడ ఎంపికైన వారు మదనపల్లిలో ఈనెల 25, 26 తేదీలలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు.

Similar News

News April 20, 2025

కోర్టుకెళ్లి నష్టపరిహారం వసూలు చేస్తా: ఎమ్మెల్యే

image

హైదరాబాద్‌ పరిధిలోని కొండాపూర్‌లో 39 ఎకరాల స్థల వివాదంలో హైడ్రా రంగంలోకి దిగింది. శనివారం పోలీసుల బందోబస్తుతో అక్కడికి చేరుకున్న అధికారులు, స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌తో పాటు భారీ షెడ్లను జేసీబీలతో తొలగించారు. ఈ స్థలం ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌కు చెందినదని సమాచారం. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కోర్టుకు వెళ్లి నష్టపరిహారం వసూలు చేస్తామని తెలిపారు.

News April 20, 2025

బంటుమిల్లి : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

image

బంటుమిల్లి మండలం నారాయణపురం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మచిలీపట్నంకు చెందిన వాసాబత్తిన వీరాచారి (29) ,అనకాపల్లి ప్రసాద్ (28) రాజమండ్రి నుంచి బైక్ పై మచిలీపట్నం వస్తుండగా కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ ఇరువురు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

News April 20, 2025

మచిలీపట్నం: అఘోరిపై ఆడిషన్ ఎస్పీకి ఫిర్యాదు

image

భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ అంబేద్కర్‌ను దుర్భాషలాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన అఘోరి శ్రీనివాసపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని  దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా సంఘం అధ్యక్షుడు దోవా గోవర్ధన్‌ ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ వివి నాయుడుకు ఫిర్యాదు చేశారు.   

error: Content is protected !!