News February 25, 2025
గుమ్మడిదల: మేము ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం: జేఏసీ

గుమ్మడిదల మండలంలో చేపట్టిన డంప్ యార్డు రద్దును చేయకపోవడంతో నిరసనగా పార్టీలు, రాజకీయాలకు తీతంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్లు జేఏసీ పేర్కొంది. నేటికీ 21వ రోజు డంప్ యార్డ్‌కి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వం, అధికారుల నుంచి ఏలాంటి స్పందన లేదన్నారు. దీంతో 27న జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనడం లేదని వారు స్పష్టం చేశారు.
Similar News
News February 26, 2025
సిద్దిపేట: ‘రాబోయేది నానో తరం’

రాబోయేది నానో తరమని సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి రాధిక పేర్కొన్నారు. మంగళవారం నానో యూరియా, డీఏపీ వినియోగంపై ఫర్టిలైజర్ డీలర్లు, ఎఫ్పీసీ సంఘం సభ్యులకు సిద్దిపేటలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంప్రదాయ యూరియా, డీఏపీ స్థానంలో ఇఫ్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నానో యూరియా, డీఏపీ వినియోగం ద్వారా తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబడులు వస్తున్నాయన్నారు.
News February 26, 2025
ఏడుపాయల జాతరకు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్

ఏడుపాయల వన దుర్గ మాత జాతర ఉత్సవాలు పురస్కరించుకొని జాతరలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాయల జాతర బందోబస్తు ఏర్పాటు పరిశీలన చేశారు. జాతర దృశ్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన పోలీసు రక్షణ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. జాతరకు 883 అధికారులు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News February 26, 2025
పిట్లం: కన్న తల్లిని చంపేశారు.. కారణమేంటో..?

నవమాసాలు మోసింది. పెంచి పెద్ద చేసింది. బిడ్డ కడుపు నిండితే తను సంతోషించింది. వృద్ధాప్యంలో తోడుగా నిలవాల్సిన తనయులె ఆ తల్లి పాలిట యముడయ్యారు. రోకలిబండతో కొట్టి హతమార్చారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పిట్లంలో మంగళవారం వెలుగు చూసింది. తల్లి కొడుకుల మధ్య ఆస్తి తగాదాలే కారణంగా తెలుస్తోంది. కాగా ఈ ఘటనలో పోలీసులు ఒకరిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఎందుకు హత మార్చారో కారణాలు తెలియాల్సి ఉంది.