News April 5, 2024
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఫోటో గ్రాఫర్ మృతి

కోదాడకు చెందిన గుండు రవి పని నిమిత్తం ఖమ్మం వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై కోదాడ వస్తుండగా వెంకటాపురం వద్ద ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. రవి కోదాడలో ఫోటో గ్రాఫర్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. రవి మృతి పట్ల ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ నాయకులు, మిత్రులు బంధువులు సంతాపం వ్యక్తం చేశారు.
Similar News
News December 15, 2025
NLG: సాఫ్ట్‌వేర్ TO సర్పంచ్

సొంతూరుకు సేవచేయాలని సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకుని వచ్చిన యువకుడు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. నల్గొండ జిల్లా అనుముల (M)ఇబ్రహీంపేట గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఎడవల్లి వంశీకృష్ణ విజయం సాధించారు. వంశీకృష్ణ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన మద్దతుదారులు గ్రామంలో సంబరాలు చేసుకుంటున్నారు.
News December 15, 2025
NLG: రెండో విడతలోనూ ఆ పార్టీదే హవా

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ ఓటర్లు అధికార పార్టీకే పట్టం కట్టారు. మొదటి రెండో విడతలో 597 స్థానాలకు ఎన్నికలు జరగగా అందులో 407 స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు దక్కించుకున్నారు. ఇక బీఆర్ఎస్ మద్దతుదారులు 146 స్థానాలు గెలుపొందారు. సీపీఐ, సీపీఎం, ఇతరులు కలుపుకొని రెండు విడతల్లో 40 మంది గెలుపొందగా.. బీజేపీ 4 స్థానాలకే పరిమితం కావలసి వచ్చింది. రెండో విడతలోను బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు.
News December 15, 2025
MLG: రెండో విడతలో తగ్గిన పోలింగ్ శాతం

మొదటి విడతలో కంటే రెండో విడతలో స్వల్పంగా పోలింగ్ శాతం తగ్గింది. మొదటి విడతలో NLG, CDR రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 14 మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 90.53 శాతం పోలింగ్ నమోదు కాగా రెండో విడతలో MLG డివిజన్ లోని 10 మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 88.74 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. రెండో విడత పోలింగ్‌లో అత్యధికంగా మాడుగులపల్లి మండలంలో 92.34 శాతం పోలింగ్ నమోదు కాగా, మిర్యాలగూడలో 85.79 శాతం పోలింగ్ నమోదైంది.


