News February 5, 2025

గుల్లకోటల: బావిలో పడి బాలుడి మృతి

image

ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో 3 సంవత్సరాల బాలుడు ప్రమాదవశాత్తు చేద బావిలో పడి బుధవారం మృతిచెందాడు. మంత్రి రంజిత్, శిరీష దంపతుల చిన్న కుమారుడు లడ్డు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి తల్లిదండ్రుల ఇంటి వెనకాల వాళ్ల అమ్మమ్మ ఇల్లు ఉంటుందని, రెండిళ్ల మధ్యలో చేద బావి ఉంటుందని, బాలుడు కనిపించకపోవడంతో బావిలో పడి ఉండటం చూసి బయటకు తీసి ధర్మారం ఆస్పత్రికి తీసుకుపోగా అప్పటికే బాలుడు మృతి చెందాడు.

Similar News

News February 6, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* జగన్ 2.O చూడబోతున్నారు: YS జగన్
* జగన్ 1.O విధ్వంసం మరిచిపోలేదు: లోకేశ్
* పవన్ కళ్యాణ్‌కు వైరల్ ఫీవర్
* గొంగడి త్రిషకు TG ప్రభుత్వం రూ.కోటి నజరానా
* కులగణన సర్వేలో మళ్లీ వివరాలివ్వొచ్చు: పొన్నం
* రాహుల్.. ఎన్నికల గాంధీగా పేరు మార్చుకోండి: KTR
* ప్రశాంతంగా ఢిల్లీ పోలింగ్.. BJPకే ఎగ్జిట్ పోల్స్ మొగ్గు
* అమెరికా నుంచి భారత్‌కు అక్రమ వలసదారులు
* భారీగా పెరిగిన బంగారం ధరలు

News February 6, 2025

‘RC16’ సెట్‌లో క్లీంకారా సందడి

image

రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ‘RC16’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కుతోంది. హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సెట్‌లో చరణ్ కుమార్తె క్లీంకార సందడి చేశారు. చెర్రీ ఆమెను ఎత్తుకుని ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News February 6, 2025

47లక్షల రైతుల పరిస్థితి ఏంటి?: హరీశ్‌రావు

image

తెలంగాణలో 68 లక్షల మంది రైతులుంటే ప్రభుత్వం 21.45 లక్షల మందికి రైతుభరోసా వేసిందని… మిగతా 47 లక్షల అన్నదాతల పరిస్థితి ఏంటని హరీశ్ రావు ప్రశ్నించారు. రైతుభరోసా మెుత్తం తొలుత రూ.7500 అని చెప్పి దానిని రూ.6వేలకే కుదించారన్నారు. ఎకరం లోపు భూమి ఉన్నవారి సంఖ్య గతంతో పోలిస్తే తగ్గిందన్నారు. కాంగ్రెస్ గోరంత చేసి కొండంతగా చెప్పుకుంటుందని తన X ఖాతాలో పోస్ట్ చేశారు.

error: Content is protected !!