News February 27, 2025
గూడూరు ఆదిశంకర కాలేజీ వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదిశంకర కాలేజీ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి టాటా ఏసీ వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వెంకటేశ్ అనే వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న గూడూరు రూరల్ పోలీసులు మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 28, 2025
CT: మరో సంచలనమా?.. దాసోహమా?

మొన్న ENGను చిత్తు చేసిన అఫ్గాన్ ఇవాళ AUSతో పోరుకు సిద్ధమవుతోంది. మ.2.30 గంటలకు ఇరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు సెమీస్ చేరనుండగా ఓడిన టీమ్ ఇంటిబాట పట్టనుంది. ENGను ఓడించి ఊపులో ఉన్న AFG.. AUSను కూడా కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. కానీ అది అంత ఈజీ కాదు. ICC టోర్నీలంటే రెచ్చిపోయే AUS.. AFGపై విరుచుకుపడే అవకాశం ఉంది. మరి మరో సంచలనం నమోదవుతుందో? AUSకు AFG దాసోహం అవుతుందో?
News February 28, 2025
మక్తల్: వెటర్నరీ అంబులెన్స్‌లను తనిఖీ చేసిన బగిష్ మిశ్రా

మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల పరిధిలోని 1962 మొబైల్ వెటర్నరీ అంబులెన్స్‌లను గురువారం స్టేట్ 1962 ప్రాజెక్టు హెడ్ డాక్టర్ బగిష్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లోని పరికరాలను, మందులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పశువులకు వైద్య సాయం కోసం 1962 కు కాల్ చేసి సంప్రదించాలని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News February 28, 2025
సేవలను మరింత మెరుగుపరచాలి: విశాఖ జేసీ

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందే సేవలను మరింత మెరుగుపరచాలని జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ వీసీ హాలులో వారితో సమావేశమైన ఆయన వివిధ అంశాలపై మార్గదర్శకాలు జారీ చేశారు. ఉచిత గ్యాస్, రేషన్ బియ్యం పంపిణీ, తూనికలు, కొలతలు ఇతర ప్రమాణాలు పాటించే క్రమంలో జాగ్రత్తలు వహించాలని చెప్పారు.