News March 6, 2025
గూడూరు: ‘ఇసుకలో తల ఇరుక్కొని చనిపోయాడు’

MHBD జిల్లా గూడూరు మండలం చిర్రకుంట తండాలో బుధవారం వ్యక్తి మరణించడంతో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిర్రకుంటతండాకు చెందిన భూక్య రాజ్ కుమార్ తన వ్యవసాయ పంట పొలాల్లో కోతుల బెడద వల్ల ఇబ్బంది పడుతున్నాడు. కాగా, కోతులు ఆవాసం ఏర్పరచుకున్న చెట్టు కొమ్మలను నరికి వేసే క్రమంలో చెట్టు పైనుంచి జారిపడ్డాడు. చెట్టు కింద వాగు ఇసుకలో తల కూరుకుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News March 6, 2025
YS జగన్‌పై పోలీసులకు ఫిర్యాదు

AP: Dy.CM పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ సీఎం జగన్‌పై జనసేన కార్యకర్తలు ఏలూరు(D) ద్వారకా తిరుమల పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఎంపీడీవో ఆఫీసు ఎదుట నిరసనకు దిగారు. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ’ అని నిన్న జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
News March 6, 2025
ఇండియాకు అప్పగిస్తే చిత్రహింసలు పెడతారు: రాణా

తనను ఇండియాకు అప్పగించొద్దని ముంబై 26/11 ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణా అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఒకవేళ అప్పగిస్తే ఆ దేశం తనను చిత్రహింసలు పెడుతుందని, అప్పగింతపై స్టే ఇవ్వాలని కోరాడు. 2023 మానవ హక్కుల నివేదిక ప్రకారం.. భారత ప్రభుత్వం మైనారిటీలపై వివక్ష చూపుతోందని తెలిపాడు. కాగా రాణా ప్రస్తుతం LA జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని తమకు అప్పగించాలని కోరగా ట్రంప్ ఓకే చెప్పారు.
News March 6, 2025
ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

TG: ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ముసాయిదాకు తుది మెరుగులు దిద్దాలని, న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలని మంత్రులకు సీఎం రేవంత్ సూచించారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలన్నారు.