News March 9, 2025

గూడూరు: గొంతులో పల్లీ ఇరుక్కొని బాలుడి మృతి

image

గూడూరు మండలం నాయకపల్లి గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. 18 నెలల బాలుడు గుండెల అక్షయ్ ఆడుకుంటూ పల్లీ గింజ నోట్లో వేసుకున్నాడు. గొంతులో పల్లీ గింజ ఇరుక్కోవడంతో ఊపిరి ఆడక చనిపోయాడు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆడుతూ, పాడుతూ ఇంట్లో తిరిగే బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News March 10, 2025

కొలిమిగుండ్ల సీఐపై YCP సంచలన ఆరోపణలు

image

కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లెలో YCP సానుభూతిపరుల చీనీ తోటను టీడీపీ వర్గీయులు జేసీబీతో ధ్వంసం చేయడం, దాడికి పాల్పడటంపై వైసీపీ మండిపడింది. ‘చీనీ తోట సాగు చేసిన భూమిపై కోర్టులో వ్యాజ్యం కొనసాగుతుండగా.. సీఐ రమేశ్ బాబు ఈ కేసులో జోక్యం చేసుకున్నారు. ఆ భూమిని TDP వారికి స్వాధీనం చేయాలంటూ మూడు రోజుల నుంచి సీఐ ఒత్తిడి తెస్తున్నారు’ అంటూ YCP సంచలన ఆరోపణలు చేసింది.

News March 10, 2025

రాజానగరం: 12మంది క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

image

రాజానగరం హైవేని ఆనుకుని ఉన్న బ్రిడ్జ్ కౌంటీలోని ఒక విల్లాలో నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ ముఠాను రాజానగరం పోలీసులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. వివిధ జిల్లాలకు చెందిన 12మంది బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి 26 మొబైల్స్, 7 ల్యాప్‌ట్యాప్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. దుబాయ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఛాంపియన్షిప్ క్రికెట్ పోటీపై ఈ బెట్టింగ్స్ జరిగాయి.

News March 10, 2025

పార్వతీపురం: దరఖాస్తుల ఆహ్వానం

image

సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎన్ తిరుపతి నాయుడు తెలిపారు. జిల్లాలో 15 మండలాల ZPHS, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హత గల ఉపాధ్యాయులు 12వ తేదీలోగా డీఈఓ కార్యాలయానికి వివరాలు తెలియజేయాలన్నారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్‌ను సంప్రదించాలన్నారు.

error: Content is protected !!