News January 3, 2025
గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే: జగన్
విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మి, బాలికా విద్య ఉద్యమానికి పునాది వేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ‘X’లో ట్వీట్ చేశారు. నేడు ఆమె పోరాటాలను, సేవలను స్మరించుకుంటూ సావిత్రిబాయి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News January 7, 2025
గుంటూరు: అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం
ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి మోసం చేశాడని చుండూరు (M) మున్నంగివారిపాలెంకు చెందిన శ్రీనివాసరావు వాపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. వ్యవసాయశాఖలో అటెండర్‌గా పనిచేసే ఎన్.సునీల్ తన బావమరిది ద్వారా పరిచయమయ్యాడన్నారు. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్లో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని తన నుంచి రూ.2 లక్షలు తీసుకున్నాడన్నారు. ఉద్యోగం రాలేదని, డబ్బులడుగుతుంటే బెదిరిస్తున్నాడని సోమవారం గ్రీవెన్స్‌లో వాపోయాడు.
News January 7, 2025
GNT: జిల్లాలో ప్రస్తుత ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా.?
స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 17,96,356 మంది ఓటర్లు ఉన్నారని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ అన్నారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరి రివిజన్‌పై అధికారులు, రాజకీయ పార్టీ నాయకులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లకు కూడా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
News January 7, 2025
వృద్దులు, మహిళలకు ఫిర్యాదులపై శ్రద్ధ: ఎస్పీ
వృద్దులు, మహిళలకు సంబంధించిన ఫిర్యాదుల పట్ల శ్రద్ధ వహించి, చట్ట పరిధిలో వారి ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేయాలని గుంటూరు జిల్లా ఎస్పీ సూచించారు. సోమవారం, జిల్లా పోలీస్ కార్యాలయంలో PGRS కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీలు జనార్ధనరావు, రమేశ్, మురళీ కృష్ణ, PGRS సీఐ శ్రీనివాసరావు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.