News April 21, 2025
గొల్లపూడి పంచాయితీకి అవార్డు

ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద జాతీయ పంచాయతీ అవార్డు-2025కు గొల్లపూడి పంచాయతీ ఎంపికైందని పంచాయతీరాజ్ శాఖ సంచాలకుడు కృష్ణతేజ సోమవారం తెలిపారు. సొంత ఆదాయ వనరుల అభివృద్ధి విభాగంలో ఈ పంచాయతీ జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచిందన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం అందిందని ఆయన వెల్లడించారు.
Similar News
News April 21, 2025
ప్రజల ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి: BHPL ఎస్పీ

ప్రజల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, సామాన్యులు నిర్భయంగా పోలీస్‌స్టేషన్లకు వచ్చి ఫిర్యాదులు అందజేయాలని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా దివాస్‌లో భాగంగా 18 మంది బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబధిత అధికారులను ఆదేశించారు.
News April 21, 2025
VZM: 18 మందికి రూ.63లక్షల రుణాలు

విజయనగరం కలెక్టరేట్లో 18 మంది దివ్యాంగులకు రూ.63 లక్షల విలువగల రుణాలను కలెక్టర్ అంబేడ్కర్ సోమవారం పంపిణీ చేశారు. అలాగే విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ ద్వారా డిగ్రీ ఆపై కోర్సులు రెగ్యులర్‌గా చదువుతున్న 29 మంది దివ్యాంగులకు 29 ల్యాప్టాప్‌లు, మూగ, చెముడు అభ్యర్థులకు ఆరు టచ్ ఫోన్లు, ట్రై సైకిళ్లను అందజేశారు.
News April 21, 2025
ఈ నెల 25న ఓటీటీలోకి ‘మ్యాడ్ స్క్వేర్’

సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’ ఈ నెల 25 నుంచి NETFLIXలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉండనుందని నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్ ట్వీట్ చేసింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.