News February 10, 2025

గొల్లప్రోలు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

image

గొల్లప్రోలుకు చెందిన గంపల జెంబు ఈ నెల 3న చేబ్రోలుకు వంట పనినిమిత్తం వెళ్లి తిరిగి రాత్రి సమయంలో వస్తుండగా గొల్లప్రోలు డంపింగ్ యార్డ్ బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి బైక్ నుంచి ప్రమాదవశాత్తు పడిపోవడంతో తలకు గాయమైంది. దీంతో అతడిని కాకినాడలో ఓ ప్రైవేట్ హస్పిటల్‌లో చేర్చారు. అతను చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందారు. దీనిపై గొల్లప్రోలు ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News December 15, 2025

పొట్టి శ్రీరాములుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: CM CBN

image

AP: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనకు ఘన నివాళి అర్పించారు. ‘గాంధీ బాటలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్న ధీరోదాత్తుడు శ్రీరాములు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలని ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడి సాధించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు తన ప్రాణత్యాగంతో నాంది పలికిన ఆ మహనీయునికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

News December 15, 2025

MBNR: SGF U-19 హ్యాండ్ బాల్ పోటీలు.. విజేతలు వీరే!

image

మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఎస్జీఎఫ్ U- 19 హ్యాండ్ బాల్ ఎంపికలు ముగిశాయి.
✔ బాలికల విభాగంలో
✒1st ప్లేస్- మహబూబ్ నగర్
✒2nd ప్లేస్- వరంగల్
✒3rd ప్లేస్- కరీంనగర్
✔ బాలుర విభాగంలో
✒1st ప్లేస్- మహబూబ్ నగర్
✒2nd ప్లేస్- వరంగల్
✒3rd ప్లేస్- ఖమ్మం
గెలుపొందిన జట్లను పలువురు అభినందించారు. స్థానిక నేతలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

News December 15, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గోల్డ్ రేట్స్ ఇవాళ కూడా భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.820 పెరిగి రూ.1,34,730కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.750 ఎగబాకి రూ.1,23,500 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.3,000 పెరిగి రూ.2,13,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.