News April 17, 2025
గోదావరిఖని పట్టణంలో యువతి ఆత్మహత్య

గోదావరిఖని పవర్ హౌస్‌కాలనీకి చెందిన చుంచు ప్రత్యూష(26) ఆత్మహత్య చేసుకుంది. PG పూర్తిచేసిన ప్రత్యూష కొద్ది రోజులుగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. అయితే, ఇటీవల వెలువడ్డ గ్రూప్స్ ఫలితాల్లో ఉద్యోగం సాధించలేకపోవడంతో మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో బుధవారం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతి తండ్రి విఠల్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భూమేష్ తెలిపారు.
Similar News
News December 14, 2025
KMR: ముగిసిన పోలింగ్ సమయం.. కౌంట్ డౌన్ స్టార్ట్

కామారెడ్డి జిల్లాలో రెండవ విడత పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎల్లారెడ్డి డివిజన్‌లోని 4 మండలాల్లో బాన్సువాడ డివిజన్‌లోని 3 మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో గేటు లోపల ఉన్న ఓటర్లకు అనుమతించి పోలింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం 2 గం.ల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానుంది. బరిలో నిలిచిన అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
News December 14, 2025
బౌండరీల వర్షం.. అదరగొట్టిన జైస్వాల్, సర్ఫరాజ్

SMATలో హరియాణాతో జరిగిన మ్యాచులో ముంబై బ్యాటర్లు అదరగొట్టారు. 235 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో ఛేదించారు. ఓపెనర్ జైస్వాల్ 48 బంతుల్లో సెంచరీ (16 ఫోర్లు, 1 సిక్సు) చేయగా, సర్ఫరాజ్ ఖాన్ 25 బంతుల్లో 64 రన్స్(9 ఫోర్లు, 3 సిక్సులు)తో రాణించారు. 3వ ఓవర్లో జైస్వాల్ వరుసగా 6, 4, 4, 4 బాదగా, 6వ ఓవర్లో సర్ఫరాజ్ వరుసగా 6, 0, 4, 4, 4, 4 సాధించారు. 7వ ఓవర్లోనూ 4 ఫోర్లతో బౌండరీల వర్షం కురిపించారు.
News December 14, 2025
విజయనగరం జిల్లా బొబ్బిలిలో మెగా జాబ్‌మేళా

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, విజయనగరం జిల్లా, బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ఆధ్వర్యంలో డిసెంబర్ 16న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నాయి. 18-35ఏళ్ల మధ్య వయసు కలిగి, టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 10 మల్టీ నేషనల్ కంపెనీలు జాబ్ మేళాలో నిరుద్యోగులను రిక్రూట్ చేసుకోనున్నాయి.


