News March 21, 2025
గోదావరిఖని: ప్రాణం తీసిన బెట్టింగ్..

బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పెట్టి మోసపోయి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ డయాగ్నస్టిక్ సెంటర్లో పనిచేస్తున్న కొరవీణ సాయితేజ బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపం చెంది రెండురోజుల క్రితం గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు.
Similar News
News March 31, 2025
గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే

TG: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన కొమ్మిరెడ్డి లక్ష్మీ దీపిక టాపర్‌గా నిలిచారు. మొత్తం 900 మార్కులకు గానూ 550 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఆమె MBBS పూర్తి చేశారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే సివిల్స్‌కు సిద్ధమయ్యారు. నాలుగేళ్లపాటు యూపీఎస్సీ, గ్రూప్-1 కోసం సన్నద్ధమయ్యారు. దీపిక తండ్రి కృష్ణ ఏజీ ఆఫీస్‌లో సీనియర్ ఆఫీసర్.
News March 31, 2025
ఆదోనిలో సచివాలయ ఉద్యోగి సూసైడ్

ఆదోని మండలం కపటి గ్రామ సచివాలయ ఉద్యోగి మధు సూసైడ్ చేసుకున్నాడు. శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన మధు (26) కపటిలో డిజిటల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చి భోజనం చేసి మేడపై గదిలో పడుకున్నాడు. ఆదివాదం ఉదయం తల్లిదండ్రులు చూడగా .. అప్పటికే ఉరివేసుకుని చనిపోయాడు. తండ్రి నారాయణరావు ఫిర్యాదుతో త్రీ టౌన్ సీఐ రామలింగయ్య కేసు నమోదు చేశామన్నారు.
News March 31, 2025
వ్యక్తిగత గొడవల్ని పార్టీలకు ఆపాదించవద్దు: పరిటాల

రామగిరి మండలం పాపిరెడ్డి పల్లి గ్రామంలో జరిగిన ఘటనకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. గ్రామంలో ఉగాది పండుగ నేపథ్యంలో కొందరు తమ పెద్దల సమాధుల వద్ద, దేవాలయం వద్ద పూజలు చేసి వస్తుండగా.. ఈ గొడవ మొదలైందన్నారు. క్షణికావేశంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారని అన్నారు.