News October 17, 2024

గోదావరిఖని: రహదారిపై యువకుడి మృతి 

image

గోదావరిఖని పరశురాం నగర్‌కు చెందిన సంతోశ్ పట్టణంలోని కళ్యాణ్ నగర్ మటన్ షాపుల రహదారిపై మృతి చెందాడు. ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయి ప్రాణాలు వదిలాడు. అయితే అతిగా మద్యం తాగి మరణించి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 17, 2024

కరీంనగర్: SU పీజీ ఫలితాలు విడుదల

image

SU పీజీ ఫలితాలు విడుదలయ్యాయి. జులై, ఆగస్టులో నిర్వహించిన M.COMలోని జనరల్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇన్సూరెన్స్, MBA, MSCలోని కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో 2, 4వ సెమిస్టర్ ఫలితాలు రిలీజ్ చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.శ్రీరంగప్రసాద్ తెలిపారు. https://satavahana.ac.in/ ఫలితాలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.

News October 17, 2024

KNR రీజియన్‌లోని బస్సు డిపోల వారీగా ఆదాయ వివరాలు

image

బతుకమ్మ, దసరా సందర్భంగా KNR రీజియన్‌లోని బస్సు డిపోల వారీగా ఆర్టీసీకి వచ్చిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. గోదావరిఖని-రూ.527.45(లక్షలు), హుస్నాబాద్-రూ.143.42, హుజూరాబాద్-రూ.211.49, జగిత్యాల- రూ.421.74, కరీంనగర్-1 రూ.338.36, కరీంనగర్-2 రూ.423.19, కోరుట్ల-రూ.225.73, మంథని- రూ.183.91, మెట్పల్లి-రూ.214.21, సిరిసిల్ల- రూ.227.44, వేములవాడ-రూ.232.86(లక్షలలో) వచ్చాయి.

News October 17, 2024

KNR రీజియన్‌లో పండగ ఆదాయం రూ.31.50 కోట్లు

image

బతుకమ్మ, దసరా పండగల సందర్భంగా కరీంనగర్ రీజియన్ పరిధిలో ఆర్టీసీకి రూ.31.50 కోట్ల ఆదాయం సమకూరిందని కరీంనగర్ RM ఎన్.సుచరిత ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఆదాయ సముపార్జనలో శక్తివంచన లేకుండా కృషి చేసిన ఆర్టీసీ సంస్థ సిబ్బందికి, ప్రత్యేకంగా డ్రైవర్, కండక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ సేవలపై నమ్మకముంచి ఇంతటి ఆదాయాన్ని ఆర్జించుటలో సహకరించిన ప్రతి ఒక్క ప్రయాణికుడికి సంస్థ తరఫున ధన్యవాదాలు తెలిపారు.