News February 28, 2025

గౌరారంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

గౌరారం రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ టీచర్స్ కాలనీకి చెందిన శ్యామ్ బహదూర్ సింగ్ (41), చందు యాదవ్, సాయి కుమార్ రాయపోల్ నుంచి మేడ్చల్ వెళ్తున్నారు. గౌరారం రాజీవ్ రహదారిపై హైదరాబాద్ నుంచి వస్తున్న ట్రక్‌ని కారు ఢీ కొట్టింది. శ్యామ్ బహదూర్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరికి గాయాలు తగిలాయి.

Similar News

News March 1, 2025

మాజీ సీఎం కేసీఆర్‌కు పెండ్లి ఆహ్వాన పత్రిక

image

మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ దంపతులకు మాజీ హోం మంత్రి మహమూద్ అలీ శుక్రవారం తన మనవడి పెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. పెండ్లికి సకుటుంబ సమేతంగా రావాలని కేసిఆర్‌ను ఈ సందర్భంగా ఆయన కోరారు. పెండ్లికి తప్పకుండా వస్తానని మాజీ ముఖ్యమంత్రి తెలిపినట్లు సమాచారం. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు.

News March 1, 2025

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ పై 25% రాయితీ: జిల్లా కలెక్టర్

image

శుక్రవారం సీఎస్‌తో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో భాగంగా అధికారులతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ఫీజులో 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. మార్చి 31వ తేదీతో లే అవుట్ల దరఖాస్తుల రుసుము చెల్లించే గడువు ముగుస్తుందన్నారు.

News March 1, 2025

ఇంటర్ పరీక్షలు.. సీఎస్ కీలక సూచనలు

image

TG: ఇంటర్ పరీక్షలు సజావుగా సాగేలా చూడాలని కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి సూచించారు. పరీక్షల నిర్వహణపై వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. చేతి గడియారంతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమని తెలిపారు. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చూడాలని పోలీసులను సీఎస్ ఆదేశించారు.

error: Content is protected !!