News December 31, 2024
గ్రీటింగ్ కార్డ్స్ ❤
న్యూ ఇయర్ అంటే ఒకప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ సందడి. అంగట్లో ఛార్ట్ కొని శుభాకాంక్షలు చెబుతూ ఫ్రెండ్స్‌కు పంచేటప్పుడు వచ్చే ఆనందమే వేరు. కార్డులు ఇవ్వకపోతే కొత్త ఏడాది రానట్టే అని ఫీలైన వారు ఎంతమందో. ఇంట్లో మారాం చేసయినా తమకు ఇష్టమైన నటీనటుల కార్డులు కొనేవారు. రాను రాను ఆ కార్డులు కనుమరుగైపోయాయి. టెక్నాలజీ యుగంలో కంప్యూటర్ గ్రీటింగ్సే దిక్కయ్యాయి. మరి ఆ కార్డుల అనుభూతి మీరు పొందారా? కామెంట్ చేయండి..
Similar News
News January 23, 2025
సోమందేపల్లి: బంగారమని చెప్పి భారీ మోసం
నకిలీ నగలను బంగారమని చెప్పి అమ్మి మోసం చేసే ముఠాను సోమందేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు వివరాలు.. పొలాన్ని దున్నుతుంటే బంగారు హారాలు లభ్యమయ్యాయని, తక్కువకే ఇస్తామని ఇద్దరిని మోసం చేశారని తెలిపారు. వారి ఫిర్యాదుతో హిందూపురం – పెనుకొండ వైపుకు వస్తుండగా 10 మందిని పట్టుకోగా..నిజం ఒప్పుకున్నట్లు తెలిపారు. వారి వద్ద రూ. రూ.21 లక్షలు, 5 బైకులు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
News January 23, 2025
అనంతపురం జిల్లా నిరుద్యోగ మహిళలకు శుభవార్త
రూట్ సెట్ సంస్థలో ఈ నెల 25 నుంచి 30 రోజుల పాటు కంప్యూటర్ ట్యాలీలో ఉచితశిక్షణ ఇవ్వనున్నట్లు రూట్ సెట్ సంస్థ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. అనంతపురం జిల్లాలకు చెందిన గ్రామీణ నిరుద్యోగ మహిళలు అర్హులన్నారు. 18-45 ఏళ్ల వారు ఆధార్, రేషన్ కార్డుతో రూట్ సెట్ సంస్థ ఆఫీసులో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి కల్పిస్తామన్నారు.
News January 23, 2025
పశు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్
శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఈనెల 31వ తేదీ వరకు నిర్వహించే పశు ఆరోగ్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో పశు ఆరోగ్య శిబిరాలకు సంబంధించిన పోస్టర్లను సంబంధిత అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. జిల్లాలోని 32 మండలాల్లో మండలానికి ఒక వైద్య శిబిరరం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.