News April 1, 2025
గ్రూప్ 1 ఫలితాలలో సత్తా చాటిన నారాయణపేట బిడ్డ

నారాయణపేట జిల్లా కేంద్రం యాదవనగర్‌కు చెందిన వీణ గ్రూప్ 1 ఫలితాలలో సత్తా చాటింది. రాష్ట్రస్థాయిలో 118వ ర్యాంక్, ఎస్టీ కేటగిరిలో మల్టీ జోన్-2 లో మూడో ర్యాంక్ సాధించింది. ఆమె మొదట 2024లో గురుకుల డిగ్రీ కళాశాల లెక్చరర్‌గా ఎంపికైంది. 2025లో జూనియర్ లెక్చరర్‌గా ఎంపికై ప్రస్తుతం గోల్కొండ మహిళా కళాశాలలో విధులు నిర్వహిస్తున్నారు.
Similar News
News April 4, 2025
సచివాలయంలో అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశం

AP: రాష్ట్ర సచివాలయంలోని 2వ బ్లాకులో జరిగిన <<15986572>>అగ్నిప్రమాదం<<>>పై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. బ్యాటరీ, UPS రూమ్‌లో ఫైర్ అలారం లేకపోవడంపై ఆరా తీశారు. అన్ని బ్లాకుల్లో ఫైర్ అలారాలు తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. తెల్లవారుజామున జరిగిన ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఫైర్ ఆడిట్ చేయించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
News April 4, 2025
పెద్దపల్లి: మట్టి మాఫియాపై చర్యలేవి?: గొట్టెముక్కుల

పెద్దపల్లి జిల్లాలో మట్టి మాఫియా పెరిగిపోయిందని బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, పెద్దపల్లి నియోజకవర్గ బీజేపీ నాయకులు గొట్టెముక్కుల సురేశ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని ఇటుక బట్టీలకు అక్రమంగా మట్టిని తరలిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వానికి కోట్లల్లో నష్టం వస్తున్నా మౌనం పాటించడం ఎందుకని ప్రశ్నించారు. వెంటనే అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
News April 4, 2025
గజపతినగరం: చెట్టు పైనుంచి జారిపడి ఒకరి మృతి

గజపతినగరం మండలంలో తాటి చెట్టు పైనుంచి జారిపడి ఒకరు మృతి చెందారు. ఎం.కొత్తవలస గ్రామానికి చెందిన భోగాది సత్యం (50) కల్లు తీసేందుకు తాటిచెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు పైనుంచి జారిపడి మృతి చెందినట్లు సత్యం భార్య భోగాది లక్ష్మి శుక్రవారం తెలిపారు. గజపతినగరం ఎస్సై లక్ష్మణరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ పెద్ద చనిపోవడంతో కుటుంబం రోడ్డున పడిందని లక్ష్మీ వాపోయారు.