News March 31, 2025
గ్రూప్-1లో మంథని యువకుడికి 114వ ర్యాంకు

మంథని మండలం కాన్సాయిపేట గ్రామానికి చెందిన జక్కుల అరుణ్ కుమార్ ర్యాంకుల పరంపర కొనసాగిస్తున్నాడు. తాజాగా గ్రూప్-1లో అరుణ్ కుమార్ రాష్ట్రస్థాయిలో 114వ, మల్టీ జోన్-1 స్థాయిలో 64వ ర్యాంక్ సాధించాడు. 2018లో ట్రిపుల్ ఐటీ జబల్‌పూర్‌లో బీటెక్(సీఈసీ) పూర్తిచేశాడు. గ్రూప్-2లో రాష్ట్రస్థాయిలో 35వ ర్యాంక్, గ్రూప్-3లో రాష్ట్రస్థాయిలో 81వ ర్యాంక్ సాధించాడు.
Similar News
News April 3, 2025
సిరిసిల్ల జిల్లాలో తగ్గుముఖం పట్టిన ఎండ

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటల్లో ఎండ తీవ్రత తగ్గుముఖం పట్టింది. వీర్నపల్లి 36.9 °c, గంభీరావుపేట 36.8°c, కోనరావుపేట 36.3, సిరిసిల్ల 36.2, ఇల్లంతకుంట 36.0°c, బోయిన్పల్లి 36.1°c, చందుర్తి 35.2°c, రుద్రంగి 35.0 డిగ్రీలుగా నమోదు అయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం ఉదయం పలు మండలాలలో మేఘాలు కమ్ముకుపోయి చిన్న చిన్న జల్లులు కురుస్తున్నాయి.
News April 3, 2025
జగిత్యాల: ఈఎంటీ సేవలు అభినందనీయం: జిల్లా వైద్యాధికారి ప్రమోద్

జిల్లాలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల సేవలు అభినందనీయమని జగిత్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ అన్నారు. జాతీయ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మాతా శిశు కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 108లో పనిచేసే సిబ్బంది అందిస్తున్న సేవలను కొనియాడారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని శాలువాతో సత్కరించారు. ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
News April 3, 2025
మరో దోపిడీకి తెరలేపిన రేవంత్ సర్కార్: KTR

TG: కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో చిత్తుకాగితంతో సమానమని సీఎం రేవంత్ మరోసారి నిరూపించారని KTR దుయ్యబట్టారు. ఉచిత LRS అని మభ్యపెట్టి అధికారంలోకి రాగానే రూ.1,400 కోట్లు వసూలు చేశారని మండిపడ్డారు. రూ.కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని, ఖజానా నింపుకునేందుకు గడుపు పెంచి మరో దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. హామీని మరచి ప్రజల జేబులు ఖాళీ చేస్తున్న CONG సర్కారు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.