News March 15, 2025
గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాల్లో సత్తాచాటిన బీర్పూర్ యువకుడు

బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన చీరనేని రాజశేఖర్ ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో 287 ర్యాంకు, గ్రూప్-3 ఫలితాల్లో 86 రాంక్ సాధించారు. ప్రస్తుతం ఆర్మూర్ డిగ్రీ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. గతంలో రైల్వేలో ఉద్యోగం, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో బీట్ ఆఫీసర్ కూడా విధులు నిర్వర్తించారు. దీంతో తల్లిదండ్రులు చంద్రయ్య, రాజవ్వ, గ్రామస్థులు రాజశేఖర్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News March 15, 2025
తగ్గిన బంగారం ధరలు

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితితో నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాదులో 24K గోల్డ్ 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.89,670 వద్ద కొనసాగుతోంది. ఇక 22K 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.82,200 వద్దకు చేరుకుంది. వెండి కిలో రూ.1,12,000 వద్ద యథాతథంగా ట్రేడవుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.27,780 వద్ద ఉంది.
News March 15, 2025
రైతు రుణమాఫీపై సభలో మాటల యుద్ధం

TG: అసెంబ్లీలో రైతు రుణమాఫీపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దీనిపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. సగం మందికి కూడా మాఫీ జరగలేదన్నారు. దీంతో రైతుల వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ జిల్లాల వారీగా ఎన్నికోట్ల మాఫీ జరిగిందో భట్టి చదివి వినిపించారు.
News March 15, 2025
అప్పటివరకు రోహిత్ శర్మనే కెప్టెన్?

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ వరకు భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొనసాగుతారని తెలుస్తోంది. ఆ తర్వాత కెప్టెన్సీ మార్పు ఉంటుందని బీసీసీఐ వర్గాల సమాచారం. దీనిపై బీసీసీఐ కూడా ఇప్పటికే ఫిక్స్ అయిందని టాక్. కాగా గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన BGTలో భారత్ పేలవ ప్రదర్శన చేసింది. రోహిత్ సారథ్యంలో టీమ్ ఇండియా 1-3 తేడాతో చిత్తుచిత్తుగా ఓడింది. దీంతో కెప్టెన్‌ను మార్చాలని డిమాండ్లు వినిపించాయి.