News February 12, 2025

గ్రేటర్ HYD లైబ్రరీల్లో సిబ్బంది కొరత..!

image

గ్రేటర్ HYDలోని అనేక గ్రంథాలయాల్లో ఇప్పటికి సిబ్బంది లేక తీవ్రంగా ఇబ్బందులు కలుగుతున్నట్లు పాఠకులు తెలుపుతున్నారు. సెంట్రల్ లైబ్రరీ సహా, HYD కేంద్రంగా ఉన్న అనేక గ్రంథాలయాల్లో తృతీయ శ్రేణి రికార్డు సహాయకులు సైతం లేరు. గ్రంథాలయాలలో ఉన్న ఖాళీలన్నింటిని నింపాలని విద్యార్థులు, పాఠకులు డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News February 12, 2025

శామీర్‌పేట్‌లో యాక్సిడెంట్.. యువతి మృతి (UPDATE)

image

శామీర్‌పేట్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యి చికిత్స పొందుతున్న యువతి భవాని మంగళవారం అర్ధరాత్రి మృతి చెందింది. సోమవారం రెడీ‌మిక్స్ వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలు కాగా వెంటనే కొంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు వైద్యచికిత్సల నిమిత్తం రూ.రెండున్నర లక్షలు వసూలు చేశారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

News February 12, 2025

రేపు పార్లమెంట్ ముందుకు ట్యాక్స్ బిల్లు

image

రేపు పార్లమెంట్‌లో కొత్త ఇన్‌కం ట్యాక్స్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. 536 సెక్షన్లు, 23 చాప్టర్లు, 622 పేజీలతో బిల్లును రూపొందించినట్లు సమాచారం. 1961 నుంచి ఉన్న పాత బిల్లుకు స్వస్తి పలకనున్న కేంద్రం, ఏప్రిల్ 1 నుంచి కొత్త ట్యాక్స్ బిల్లును అమల్లోకి తీసుకురానుంది. దీని ద్వారా ట్యాక్స్ విధానం సులభతరం కానుందని కేంద్రం తెలిపింది.

News February 12, 2025

వసతి గృహాల రిపేర్స్‌కు ప్రపోజల్స్ పంపండి: తిరుపతి కలెక్టర్

image

జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాలలో మరమ్మతుల నిమిత్తం ప్రపోజల్స్ పంపించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.  

error: Content is protected !!