News April 8, 2024
గ్రేటర్ HYDలో పెరిగిన బీర్ల విక్రయాలు
గ్రేటర్ HYDలో బీర్ల అమ్మకాలు పెరిగాయి. లిక్కర్‌కు బదులు చల్లటి బీర్ల వైపు మందుబాబులు మొగ్గు చూపుతున్నారు. ప్రతిరోజు గ్రేటర్‌లో 60 నుంచి 80 వేల కేసులకు పైగా బీర్లు అమ్ముడవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 20 వేల కేసులకు డిమాండ్ ఉన్నప్పటికీ కొరత దృష్ట్యా వినియోగదారులకు అందడం లేదని టాక్. ఏప్రిల్ నెలలోనే కొరత ఇలా ఉంటే మే నెలంతా బీర్ల డిమాండ్‌ను ఎదుర్కోవడం ఎలా అని వ్యాపారులు అంటున్నారు.
Similar News
News November 25, 2024
HYD: తెలుగులో భారత రాజ్యాంగం
HYDలోని రెడ్ హిల్స్ వద్ద ఉన్న సూరన ఆడిటోరియంలో భారత రాజ్యాంగ తెలుగు అనువాద పుస్తకావిష్కరణ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమానికి DSP చీఫ్ డాక్టర్ విశారదన్ మహారాజ్ పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగ స్ఫూర్తిని అణువణువునా నింపుకొని, భారత పౌరులు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
News November 25, 2024
HYD: లోక్‌మంథన్ ఫెస్టివల్ ఘనంగా ముగింపు
శిల్పకళ వేదికలో లోక్‌మంథన్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన మాట్లాడుతూ.. వనవాసి గ్రామవాసి, నగరవాసి అందరూ భారతీయులే అని తెలిపారు. దేశ సంస్కృతి ఉట్టిపడేలా కళాకారులు ప్రదర్శించారని చెప్పారు. దేశంలో స్వార్థం ఎక్కువగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, కిషన్‌రెడ్డి, గజేంద్ర శెఖావత్ పాల్గొన్నారు.
News November 25, 2024
HYD: అక్రమ కనెక్షన్లపై ఫిర్యాదు చేయండి: MD
HYDలో జలమండలి అధికారుల నుంచి అనుమతి లేకుండా అక్రమంగా తాగునీటి నల్లా, సీవరేజ్ పైపులైన్ కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. అక్రమ నల్లా, సీవరేజ్ కనెక్షన్లు గుర్తిస్తే.. జలమండలి విజిలెన్స్ బృందానికి 9989998100, 9989987135 ఈ నంబర్ల ద్వారా సమాచారం అందించాలని ఎండీ అశోక్ రెడ్డి ప్రజలను కోరారు.