News February 22, 2025
ఘనంగా విశాఖ తొలి మేయర్ NSN రెడ్డి జయంతి

విశాఖ నగర మొదటి మేయర్ NSN రెడ్డి 95వ జయంతిని ఘనంగా నిర్వహించారు. జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి శనివారం పూలమాలలు వేశారు. బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు తదితరులు పాల్గొని ఎన్.ఎస్.ఎన్.రెడ్డి సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు కృషిచేసిన ప్రజా నాయకుడు ఎన్.ఎస్.ఎన్.రెడ్డి అని కొనియాడారు.
Similar News
News February 23, 2025
శివరాత్రి స్పెషల్.. అప్పికొండ, R.K బీచ్‌లకు ప్రత్యేక బస్సులు

శివరాత్రి జాగరణ అనంతరం సముద్ర స్నానాలు ఆచరించే వారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు శనివారం తెలిపారు. ఫిబ్రవరి 26 అర్ధరాత్రి నుంచి 27 సాయంత్రం వరకు గాజువాక, కుర్మన్నపాలెం, అగనంపూడి నుంచి అప్పికొండకు.. తగరపువలస, భీమిలి, ఆరిలోవ కాలనీ, రవీంద్ర నగర్, పెందుర్తి, కొత్తవలస, సింహాచలం, గాజువాక నుంచి ఆర్.కె.బీచ్‌కు బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు.
News February 23, 2025
విశాఖలో నకిలీ పోలీస్ అరెస్ట్

విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పోలీస్‌ను ఎయిర్ పోర్ట్ సీఐ ఉమామహేశ్వరరావు శనివారం అరెస్ట్ చేశారు. NAD, శాంతినగర్ పార్క్ ఏరియాలో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయనగరానికి చెందిన నిందుతుడు బోను దుర్గారావును అరెస్ట్ చేశారు. రెండు నకిలీ పోలీసు గుర్తింపు కార్డులు, బెదిరించి దోచుకున్న స్కూటీతో పాటు ఒక మొబైల్ ఫోన్ సీజ్ చేసి రిమాండ్‌కు తరలించారు.
News February 23, 2025
మిస్సింగ్ కేసులను ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ టూ టౌన్ స్టేషన్ పరిధిలో విశాఖ, విజయనగరానికి చెందిన రెండు మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మిస్సింగ్ కేసులపై టూ టౌన్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేసి గుర్తించారు. ఇద్దరు మహిళలను శనివారం వారి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. రెండు మిస్సింగ్ కేసులను ఛేదించిన టూ టౌన్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.