News February 25, 2025
ఘన్‌పూర్: సభను విజయవంతం చేయండి: మల్లు రవి

వచ్చే నెల 2న వనపర్తి కి సీఎం రేవంత్ రెడ్డి విచ్చేయుచున్నట్లు నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి తెలిపారు. వనపర్తి పట్టణ కేంద్రంలోని రూ.500 కోట్లతో లోన్ మేళా, జాబ్ మేళా, స్కిల్ డెవలప్ మెంట్ మేళాలకు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News February 26, 2025
హనుమకొండ: వేయి స్తంభాల ఆలయంలో పోలీసుల పటిష్ఠ బందోబస్తు

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేయి స్తంభాల దేవాలయంలో జరిగే శివరాత్రి ఉత్సవాల సందర్భంగా హనుమకొండ డివిజన్ పోలీసులు భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఈ బందోబస్త్ ఏర్పాటుకు సంబంధించి హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి పోలీస్ అధికారులు, సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు.
News February 26, 2025
హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆదేశాలు

రానున్న వేసవి దృష్ట్యా సంబంధిత శాఖల అధికారులు ప్రజలను వడగాలుల నుంచి అప్రమత్తం చేయడంతో పాటు ఆయా శాఖల ఆధ్వర్యంలో రక్షణ ఏర్పాట్లను సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో రానున్న వేసవి కాలానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్‌పై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
News February 26, 2025
నర్సంపేట: తండ్రి సంవత్సరికం మరుసటి రోజే కొడుకు మృతి

తండ్రి సంవత్సరికం మరుసటి రోజే కొడుకు మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముగ్దుపురంలో చోటుచేసుకుంది. చింతకాయల రాజశేఖర్ ఆర్థిక, అనారోగ్య సమస్యలతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజశేఖర్ తండ్రి మల్లయ్య ఏడాది క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. మల్లయ్య సంవత్సరికం రోజే రాజశేఖర్ పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతిచెందగా, స్థానికులు నివాళులర్పించారు.