News January 29, 2025

ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, కొడుకుల మృతి

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదోని బైపాస్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న తండ్రి, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, మృతులది ఎమ్మిగనూరు మండలం కొట్టేకల్ గ్రామంగా గుర్తించారు.

Similar News

News March 14, 2025

NEPని ఒప్పుకోనందుకు రూ.2,152 కోట్లు ఇవ్వలేదు: తమిళనాడు మంత్రి

image

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అంగీకరించనందుకు కేంద్రం తమిళనాడుకు రూ.2,152 కోట్లు విడుదల చేయలేదని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు తెలిపారు. ‘మా రాష్ట్రంలో మూడు భాషల విధానాన్ని అంగీకరించనందుకు కేంద్రం ఆ నిధులను ఆపింది. అయినా ఫర్వాలేదు. ప్రభుత్వ విద్యార్థుల సంక్షేమం, టీచర్ల జీతాలు, ఇతర ఖర్చుల కోసం మా రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటాయిస్తాం’ అని బడ్జెట్ సందర్భంగా వెల్లడించారు.

News March 14, 2025

వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో కనీస వసతులు కల్పించాలి: సీపీఎం 

image

వికారాబాద్ జిల్లాలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌లో కనీస వసతులు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.మహిపాల్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా TGSRTC బస్టాండ్‌లల్లో ప్రయాణికులకు బాత్రూంలు, మంచినీళ్లు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆర్టీసీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు బస్సుల సంఖ్య పెంచాలని మహిపాల్ కోరారు.

News March 14, 2025

BPO ఉద్యోగులకు Shocking News!

image

AI రాకతో BPO/BPM ఇండస్ట్రీలో హైరింగ్ తగ్గుతుందని నిపుణుల అంచనా. కంపెనీ ఆపరేషన్స్‌లో రీస్ట్రక్చర్ తప్పనిసరని, ఉద్యోగుల విధులు మారుతాయని అంటున్నారు. డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్టు, లావాదేవీల ప్రక్రియ వంటి సాధారణ పనులకు ఇకపై మనుషుల అవసరం ఉండదని చెప్తున్నారు. AI టాస్కుల పర్యవేక్షణ, దాంతో పనిచేయించే, కలిసి పనిచేసే ఉద్యోగాల సృష్టి జరుగుతుందని, ఇందుకు వారు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.

error: Content is protected !!