News March 23, 2025

చంద్రబాబు పర్యటనపై ఎమ్మెల్యే ఏలూరి వీడియో కాన్ఫరెన్స్

image

ఏప్రిల్ ఒకటిన సీఎం చంద్రబాబు పర్చూరు నియోజకవర్గంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. పర్యటన ఏర్పాట్లపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదివారం నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను నాయకులకు వివరించారు. ఈ సందర్భంగా నాయకులకు పలు సూచనలు చేశారు.

Similar News

News March 26, 2025

PM కిసాన్ అనర్హుల నుంచి రూ.416 కోట్లు రికవరీ: కేంద్రం

image

పీఎం కిసాన్ పథకం కింద లబ్ధిపొందిన అనర్హుల నుంచి ఇప్పటివరకు రూ.416 కోట్లు తిరిగి వసూలు చేసినట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్‌సభలో వెల్లడించారు. ఈ స్కీమ్‌లో భాగంగా ఇప్పటివరకు 19 విడతల్లో రూ.3.68 కోట్లకు పైగా రైతులకు అందించినట్లు తెలిపారు. ఆధార్, ఐటీ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న సమాచారంతో అనర్హులను ఏరివేసే ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 26, 2025

NGKL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం, ఏసీలు దగ్ధం

image

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని పలు ఏసీలు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. దీంతో సుమారు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పి వేసినట్లు జిల్లా ఫైర్ అధికారి కృష్ణమూర్తి తెలిపారు.

News March 26, 2025

MBNR: గ్లోబల్ బిజినెస్ అవార్డు అందుకున్న పాలమూరు వాసులు

image

మహబూబ్నగర్‌కి చెందిన జి.నారాయణ రెడ్డి, కాసోజు జగదీశ్ HYDలో నిర్వహించిన గ్రేట్ ఇండియన్ ట్యాక్స్ పేయర్స్ అవార్డ్స్ కార్యక్రమంలో గ్లోబల్ బిజినెస్ నెట్‌వర్క్ ఛైర్మన్ కడారి శ్రీధర్ ఆధ్వర్యంలో గ్లోబల్ బిజినెస్ అవార్డు అందుకున్నారు. వ్యాపార రంగంలో విశేష విజయాలు సాధించిన వ్యక్తులకు గ్లోబల్ బిజినెస్ అవార్డులు అందజేశారు. జి.నారాయణ రెడ్డి, కాసోజు జగదీశ్ హెల్త్&టర్మ్ ఇన్సూరెన్స్ రంగంలో సేవలు అందిస్తున్నారు.

error: Content is protected !!