News January 3, 2025
చంద్రబాబు పిలుపుతోనే టీడీపీలోకి: MP బీదమస్తాన్ రావు
రాజ్యసభ సభకు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన బీద మస్తాన్ రావుకు నెల్లూరు జిల్లా యాదవ సంఘం, యాదవ ఎంప్లాయిస్ అఫీషియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం నిర్వహించారు. గురువారం రాత్రి నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆత్మీయ ఆహ్వానం మేరకు టీడీపీలో చేరానన్నారు. వైసీపీ ఓడిపోవడంతో తాను రాజ్యసభకు రాజీనామా చేసి హుందాగా వ్యవహరించానని అన్నారు.
Similar News
News January 7, 2025
నెల్లూరు జిల్లాలో తగ్గిన ఓటర్లు
నెల్లూరు జిల్లాలో 2024 ఎన్నికల నాటికి 20,61, 822 మంది ఓటర్లు ఉన్నారు. తాజాగా నిన్న విడుదల చేసిన లిస్ట్ ప్రకారం 19,44,664 మంది ఉన్నారు. 1,17, 158 మంది ఓటర్లు తగ్గిపోయారు. నెల్లూరు జిల్లా ఓటరు జాబితా-2025 ప్రకారం తాజా ఓటర్ల సంఖ్య కింద విధంగా ఉంది.
➤ పురుష ఓటర్లు: 9,51,145
➤ స్త్రీలు: 9,93,309
➤ ఇతరులు: 210 మంది
➤ మొత్తం ఓటర్లు: 19,44,664
News January 7, 2025
ఉపాధిహామీ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్ ఆనంద్
ప్రతిరోజూ లక్ష పనిదినాలు లక్ష్యంగా ఉపాధిహామీ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ హాల్లో ఉపాధిహామీ, ఆర్‌డబ్ల్యుఎస్, హౌసింగ్, పంచాయతీ రాజ్ సీసీ రోడ్ల గ్రౌండింగ్, ఎంఎస్‌ఎంఈ సర్వే, ఎస్టీలకు ఆధార్‌కార్డుల జారీ, పిఎం సూర్యఘర్ యోజన పథకం అమలు మొదలైన అంశాలపై అధికారులతో మాట్లాడారు.
News January 6, 2025
నెల్లూరు: సంక్రాంతి ట్రైన్లు.. 8 గంటలకు బుకింగ్
➤ చర్లపల్లి-తిరుపతి(07077): 6వ తేదీ
➤ తిరుపతి-చర్లపల్లి(07078): 7వ తేదీ
➤ చర్లపల్లి-తిరుపతి(02764):8, 11, 15 వ తేదీ
➤ కాచిగూడ-తిరుపతి(07655): 9, 16వ తేదీ
➤ తిరుపతి-కాచిగూడ(07656): 10, 17వతేదీ
పై ట్రైన్లు నెల్లూరు, గూడూరు జంక్షన్లలో ఆగుతాయి. వీటికి ఇవాళ ఉదయం 8 గంటలకు బుకింగ్ ప్రారంభం అవుతుంది.