News March 10, 2025
చట్ట పరిధిలో సమస్యల పరిష్కరించాలి: ఎస్పీ

పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను చట్టపరిధిలో పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డుడి చెప్పారు. సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 89 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద ఎస్పీ నేరుగా అర్జీలను స్వీకరించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.
Similar News
News March 11, 2025
సంగారెడ్డి: జిల్లా కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతిని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నూతన ఎస్పీ పారితోష్ పంకజ్ సోమవారం కలిశారు. ఎస్పీగా బదిలీపై వచ్చిన పారితోష్ పంకజ్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక్కడ ఎస్పీగా పని చేసిన చెన్నూరి రూపేష్ హైదరాబాదులోని యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా బదిలీపై వెళ్లారు.
News March 10, 2025
కదిరి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్

AP: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం వేదపండితులు ఆయనకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో పాటు పలువురు టీడీపీ నేతలు లోకేశ్ వెంట ఉన్నారు. ఈ నెల 9న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 15 రోజులపాటు అంగరంగ వైభవంగా సాగనున్నాయి.
News March 10, 2025
సంగారెడ్డి: న్యాయమూర్తిని కలిసిన నూతన ఎస్పీ

సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా పారితోష్ పంకజ్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా జిల్లా న్యాయమూర్తి భవాని చంద్రను ఎస్పీ కలిశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.