News March 31, 2024

చర్లపల్లికి రవాణా సదుపాయాలు ఎలా?

image

చర్లపల్లిలో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా రూ.430 కోట్లు వెచ్చించి రైల్వే టర్మినల్ నిర్మిస్తోంది. చర్లపల్లికి మెట్రో లేకపోవడం, రోడ్లు సైతం సరిగా లేకపోవడం, రాత్రి వేళల్లో చర్లపల్లికి రవాణా సదుపాయం లేకపోవడంతో అటువైపు చూసే వారి సంఖ్య తగ్గొచ్చని ప్రజలు చెబుతున్నారు. టర్మినల్ ఏర్పాటుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.

Similar News

News September 30, 2024

HYD: కాసేపట్లో DSC రిజల్ట్స్.. అభ్యర్థులు వీరే!

image

DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
RR 3231 205 1:15
HYD 2487 285 1:09
MDCL 646 41 1:15
VKB 4630 169 1:27

News September 30, 2024

HYD: నేడు అత్తాపూర్‌కు కేటీఆర్ రాక

image

మూసీ నిర్వాసితులను పరామర్శించడానికి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోమవారం అత్తాపూర్లోని లక్ష్మీనగర్ కాలనీ, నందనవనం అపార్ట్‌మెంట్స్‌కు రానున్నారని ఆ పార్టీ నేత కొలను సుభాష్ రెడ్డి తెలిపారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్‌లో ఇళ్లు కోల్పోతున్న బాధితులను పరామర్శించి వారితో మాట్లాడతారని పేర్కొన్నారు.

News September 30, 2024

HYD: విదేశాల్లో చదువుకునేందుకు BEST CHANCE

image

మహాత్మా జ్యోతిబా ఫులే విదేశీ విద్యా పథకం కింద అర్హులైన HYD, RR, MDCL, VKBలోని బీసీ, ఈబీసీ విద్యార్థులు అక్టోబర్ 15లోగా ఈపాస్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. 35 ఏళ్లు, ఇంజనీర్, మేనేజ్మెంట్ సైన్స్, వ్యవసాయం, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సెన్స్, అగ్రికల్చర్లో 60% మార్కులు సాధించాలని పేర్కొన్నారు. విదేశీ వర్సిటీల నుంచి ఐ-20 ఫామ్ పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.