News February 6, 2025

చర్లలో ఉరేసుకుని యూపీ వాసి మృతి

image

బాత్రుంలో వ్యక్తి సూసైడ్ చేసుకున్న ఘటన చర్ల మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. UP చౌటీర్యాలీకి చెందిన అమర్ సింగ్ పానీపూరి బండితో జీవనం సాగిస్తున్నాడు. గత 2 రోజులుగా ఆరోగ్యం బాగాలేక ఇబ్బందులు పడుతున్నాడు. మనస్తాపంతో బాత్రూంలోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాత్రూం నుంచి బయటికి రాకపోయేసరికి భార్య ప్రీతి వెళ్లి చూడగా ఉరేసుకుని ఉన్నాడు.   

Similar News

News February 6, 2025

2027లో చంద్రయాన్-4 లాంచ్

image

చంద్రుడిపై రాతి నమూనాలను తీసుకొచ్చే చంద్రయాన్-4ను భారత్ 2027లో లాంచ్ చేస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఈ మిషన్లో LVM-3 రాకెట్‌ను 2సార్లు అంతరిక్షంలోకి పంపిస్తారని తెలిపారు. అవి తీసుకెళ్లే వేర్వేరు పరికరాలను చంద్రుడి కక్ష్యలోనే అసెంబుల్ చేస్తారని వివరించారు. ఆస్ట్రోనాట్‌ను రోదసిలోకి పంపే గగన్‌యాన్, సముద్ర గర్భంలో 6000KM లోతుకు వెళ్లే సముద్రయాన్‌ను 2026లో లాంచ్ చేస్తామన్నారు.

News February 6, 2025

ఆదిలాబాద్: ‘వార్షిక పరీక్షలపై ఒత్తిడికి గురికావద్దు’

image

సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో బీసీ స్టడీ సర్కిల్ ఆదిలాబాద్‌లో ఫ్రీ మెట్రిక్ వసతి గృహ పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతుల కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రాజార్షి షా పాల్గొని ప్రారంభించారు. పదోతరగతి విద్యార్థులకు వార్షికపరీక్షలకు అవసరమైన సామగ్రిని కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు.

News February 6, 2025

సర్పంచ్ ఎన్నికలు.. వికారాబాద్ జిల్లా పూర్తి వివరాలు

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మన వికారాబాద్ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు 4, మున్సిపాలిటీ‌లు 4 ఉన్నాయి. ఇదిలా ఉంటే ZPTC-20, MPP-20, MPTC-227, గ్రామ పంచాయతీలు-594, వార్డులు 5058 ఉన్నాయి. ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండడంతో‌ గ్రామాల్లో సందడి నెలకొంది.

error: Content is protected !!