News March 28, 2025
చాకిచర్ల సచివాలయం వ్యవహారంపై ఆరా తీసిన కలెక్టర్..

మండలంలోని చాకిచర్ల సచివాలయం వివాదాస్పద వ్యవహారంపై జిల్లా కలెక్టర్ నివేదిక కోరినట్లు MPDOవిజయ తెలిపారు. మంగళవారం రాత్రి ఓ ప్రైవేట్ వ్యక్తి సచివాలయం తాళం తీసి లోపలికి వెళ్ళడం.. దానిని పసిగట్టిన స్థానికులు ఆ వ్యక్తిని నిలదీసిన వైనం గురించి way2news లో ‘తాళం ఎందుకు తీశారు’.? అంటూ కథనం వచ్చిన సంగతి తెలిసిందే. సంచలనం రేపిన ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక పంపుతున్నట్లుMPDO చెప్పారు
Similar News
News April 1, 2025
హైదరాబాద్‌లోనే మాజీ మంత్రి కాకాణి..?

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు కావడంతో ఆయన అరెస్ట్‌పై ఉత్కంఠ నెలకొంది. కాకాణికి నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఈక్రమంలో ఆయన పరారీలో ఉన్నారంటూ వదంతులు వచ్చాయి. హైదరాబాద్‌లోని తన నివాసంలో జరగనున్న ఫ్యామిలీ ఫంక్షన్ ఏర్పాట్లను కాకాణి పరిశీలించారంటూ ఆయన సోషల్ మీడియాలో మంగళవారం సాయంత్రం ఓ ఫొటో పోస్ట్ చేశారు. దీంతో ఆయన పరార్ అనే వార్తలకు తెరపడింది.
News April 1, 2025
కాకాణి పారిపోలేదు: MLC

మాజీ మంత్రి కాకాణి కేసుల విషయమై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘గోవర్ధన్ రెడ్డి పారిపోయారని, అరెస్టు అయ్యారని వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దు. ఆయన తన కుటుంబంతో కలిసి ఉగాది చేసుకోవటానికి హైదరాబాద్ వెళ్లారు. బుధవారం సాయంత్రం లేదా గురువారం నెల్లూరుకు వస్తారు. కాకాణిపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించాలని ప్రభుత్వం చూస్తోంది’ అని అన్నారు.
News April 1, 2025
ఆకస్మిక తనిఖీలు చేయండి: నెల్లూరు కలెక్టర్

నెల్లూరు జిల్లాలో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు అరికట్టేందుకు ఆకస్మిక తనిఖీలు ఎక్కువగా చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ, సహాయక పునరుత్పత్తి సాంకేతిక చట్టాల అమలుపై జిల్లాస్థాయి అడ్వయిజరీ కమిటీ సమావేశం తన ఛాంబర్‌లో మంగళవారం నిర్వహించారు. గర్భస్థ శిశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని.. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు.